Asianet News TeluguAsianet News Telugu

ఆసియాలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో 8 భారత్ లోనే.. !

most polluted cities: వాయు నాణ్యత క్షీణించిన ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 679 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)తో గురుగ్రామ్ అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత బీహార్‌లోని రేవారి, ముజఫర్‌పూర్ సమీపంలోని ధరుహెరా పట్టణాలు ఉన్నాయి. 

8 of the 10 most polluted cities in Asia are in India.
Author
First Published Oct 23, 2022, 5:09 PM IST

10 most polluted cities in Asia: గ‌త కొంత కాలంగా దేశంలోని న‌గ‌రాల్లో కాలుష్యం గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ద‌నీ, అక్క‌డ నివాస‌ముంటున్న ప్ర‌జ‌లు గాలీ పీల్చుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా విడుద‌లైన ఒక రిపోర్టు ప్ర‌కారం.. ఆసియాలోని టాప్-10 వాయు కాలుష్య న‌గ‌రాల జాబితాలో భార‌త్ నుంచి 8 న‌గ‌రాలు చోటుద‌క్కించుకోవ‌డం ప్ర‌స్తుత ఆందోళ‌నక‌ర ప‌రిస్థితుల‌కు అద్దంప‌డుతున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)తో సహా ఆసియాలోని టాప్ 10 కాలుష్య నగరాల జాబితాలో ఎనిమిది భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఎనిమిది భారతీయ నగరాలు ఆసియాలోని టాప్ 10 అధ్వాన్నమైన వాయు నాణ్యత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. అయితే ఇక భార‌త్ నుంచి ఒక నగరం మాత్రమే (ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం) టాప్ 10 ఉత్తమ వాయు నాణ్యత జాబితాలో చోటు సంపాదించగలిగింది.

గురుగ్రామ్ ఆదివారం ఉదయం 679 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)తో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది, ఆ తర్వాత స్థానంలో రెవారీ సమీపంలోని ధరుహెరా పట్టణం 543 AQIతో, బీహార్‌లోని ముజఫర్‌పూర్ AQI 316తో  ఉన్నాయి. జాబితాలోకి వచ్చే ఇతర నగరాలు టాల్కాటర్, లక్నో (AQI 298), డీఆర్సీసీ ఆనంద్‌పూర్, బెగుసరాయ్, భోపాల్ చౌరాహా, దేవాస్, ఖడక్‌పడా, కళ్యాణ్, దర్శన్ నగర్, ఛప్రాలు ఉన్నాయి. భారతీయ నగరాలతోపాటు, చైనాలోని లుజౌలోని జియావోషిషాంగ్ పోర్ట్ (AQI 262) కూడా అధ్వాన్నమైన గాలి నాణ్యత కలిగిన స్టేషన్ల జాబితాలో ఉంది. మంగోలియాలోని ఉలాన్‌బాటాలోని బయాన్‌ఖోషు కూడా జాబితాలో ఉంది.

గాలి నాణ్య‌త విష‌యంలో AQI 0 నుండి 50 వరకు మంచిదిగా పరిగణించబడుతుంది. 51 నుండి 100 వరకు ఇది మితమైనదిగా పరిగణించబడుతుంది. ఇక 101 నుండి 150 వరకు సున్నితమైన సమూహాలకు అనారోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. 151 నుండి 200 వరకు అన్ని సమూహాలకు అనారోగ్యకరమైనది. 201 నుండి 300 వరకు చాలా అనారోగ్యకరమైనది. 301 దాటిన త‌ర్వాత మానవ ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. 2007లో ప్రారంభమైన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పౌరులకు వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడానికి, ఏకీకృత-ప్రపంచవ్యాప్త గాలి నాణ్యత సమాచారంతో వారికి సహాయపడే ప్రాజెక్టు ఇది. దీపావళి సందర్భంగా, ఢిల్లీ-ఎన్సీఆర్ తో సహా భారతదేశంలోని అనేక నగరాల్లో పటాకులు పేల్చడం వల్ల గాలి నాణ్యత సూచిక విపరీతమైన పెరుగుదలను చూస్తోంది. వాహ‌నాలు పెద్ద సంఖ్య‌లో పెరుగుతుండ‌టం, స‌మీపంలోని వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల కాల్చివేత గాలి కాలుష్యంపై తీవ్రమైన ప్ర‌భావం చూపుతోంది.

హైదరాబాద్ లోనూ.. 

ఇదిలావుండ‌గా, స్విస్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAir నివేదిక ప్రకారం.. భార‌త్ లో అత్యంత కాలుష్య న‌గ‌రాల్లో హైద‌రాబాద్ నాల్గో స్థానంలో ఉంది. ప్రధాన భారతీయ నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబ‌యి త‌ర్వాత హైదరాబాద్ నాల్గో స్థానంలో ఉంది. ఇది దేశంలోని దక్షిణ భాగంలో అత్యంత కలుషితమైన మెగా సిటీగా ఉంది. అక్టోబర్ 21న IQAir వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం, నగరంలో వాయు కాలుష్య స్థాయి 159 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)తో అనారోగ్యకరమైనదిగా వర్గీకరించబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios