Asianet News TeluguAsianet News Telugu

అసలే కరోనా.. ఇప్పుడు ప్రకృతి కన్నెర్ర : మంచుచరియలు విరిగిపడి 8 మంది మృతి

దేశంలో ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. ప్రకృతి కూడా భారత్‌పై పగబట్టినట్లుగా వుంది. ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లా నీతీ లోయకు సమీపంలో శుక్రవారం మంచుచరియలు విరిగిపడి 8 మంది మరణించారు. మరో 400 మందిని సహాయ సిబ్బంది రక్షించారు

8 Killed In Avalanche After Uttarakhand Glacier Burst ksp
Author
Uttarakhand, First Published Apr 24, 2021, 5:56 PM IST

దేశంలో ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. ప్రకృతి కూడా భారత్‌పై పగబట్టినట్లుగా వుంది. ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లా నీతీ లోయకు సమీపంలో శుక్రవారం మంచుచరియలు విరిగిపడి 8 మంది మరణించారు.

మరో 400 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుమ్నా ప్రాంతంలో ఈ హిమపాతం చోటుచేసుకుంది. ఘటన సమయంలో వందల మంది కూలీలు, సిబ్బంది సుమ్నా- రిమ్‌ఖిమ్‌ రహదారి నిర్మాణ పనుల్లో ఉన్నారు.  

Also Read:షాకింగ్ : రోజువారీ కేసుల్లో, మరణాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్.. కొత్తగా 3.46 లక్షలు !!

సమాచారమందుకున్న ఆర్మీ, సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దట్టంగా మంచు కురవడంతో సహాయక చర్యలకు అవరోధం ఏర్పడింది.

అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించి దాదాపు 430 మంది కూలీలను రక్షించారు. మంచు చరియల కింద ఇప్పటి వరకు 8 మృతదేహాలను గుర్తించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.   

మరోవైపు ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరథ్‌ సింగ్‌ రావత్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిస్ధితిని సమీక్షించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛమోలీలోనే భారీ మంచుచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.   

Follow Us:
Download App:
  • android
  • ios