Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : రోజువారీ కేసుల్లో, మరణాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్.. కొత్తగా 3.46 లక్షలు !!

దేశంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తూ కలవరం రేపుతున్నాయి.  3.46 లక్షల కొత్త కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తం 1.66 కోట్లకు చేరుకుంది.

3.46 Lakh Fresh COVID-19 Cases In India, 2,624 Deaths In New Record High - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 10:50 AM IST

దేశంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తూ కలవరం రేపుతున్నాయి.  3.46 లక్షల కొత్త కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తం 1.66 కోట్లకు చేరుకుంది.

తాజాగా నమోదైన 3.46 లక్షల కొత్త కేసులుతో భారత్ ప్రపంచంలోనే ఒక్కరోజులో అత్యధికంగా నమోదైన కేసులు నమోదైన దేశంగా మారింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, దేశంలో కరోనా మరణాల సంఖ్య ఒక్కరోజే 2,624 మరణాలతో రికార్డ్ సాధించింది.

దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 1.89 లక్షలకు చేరుకుంది. మెడికల్ ఆక్సిజన్, ఆసుపత్రి పడకల కొరత ఉన్న పెద్ద ఆసుపత్రులు, రోగులు వారి కుటుంబం, స్నేహితులకు SOS సందేశాలను పంపుతున్నారు.

దేశవ్యాప్తంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఒకే రోజులో అత్యధిక మరణాలను నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో  773 కోవిడ్-లింక్డ్ మరణాలు నమోదు కాగా, 24 గంటల్లో ఢిల్లీలో 348 మరణాలు నమోదయ్యాయి.

కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తున్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లను ఆపకుండా, ఆలస్యం చేయకుండా అన్ని రాష్ట్రాలు చూడాలని ఆయన అన్నారు.

కోవిడ్ తో అధికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. కరోనాతో పోరాటంలో రాష్ట్రాలన్నీ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios