తమ్ముడి హత్యకు ప్రతీకారంగా.. పాఠశాల భోజనంలో విషం కలిపిన బాలిక

7th class student mixing poison in meals at gorakhpur
Highlights

ఏడాది క్రితం తన తమ్ముడిని చంపినవారిపై పగ తీర్చుకునేందుకు ఓ బాలిక పాఠశాలలో చదువుతున్న వారందరినీ చంపేందుకు కుట్ర పన్నింది.. 

ఏడాది క్రితం తన తమ్ముడిని చంపినవారిపై పగ తీర్చుకునేందుకు ఓ బాలిక పాఠశాలలో చదువుతున్న వారందరినీ చంపేందుకు కుట్ర పన్నింది.. గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతేడాది ఐదో తరగతి విద్యార్థి మరో విద్యార్థిని ఇటుకరాయితో కొట్టి హత్య చేశాడు. దీనిపై అప్పటి నుంచి పగ పెంచుకున్న మృతుడి అక్క అతన్ని చంపాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురుచూసింది. ఈ క్రమంలో ఈరోజు భోజనంలో విషం కలిపింది.

సరిగ్గా విద్యార్థులందరికీ ఆహారం వడ్డించకముందే ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల వంటమనిషి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. వారు వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరి ముందు సదరు బాలికను నిలదీయగా.. తాను ఎలాంటి విషం కలపలేదని పేర్కొంది.. దీంతో..  ‘ ఆహార, ఔషధ పరిపాలనా శాఖ (ఎఫ్‌డీఏ) అధికారులతో ఆ పాఠశాలకు చేరుకుని ఆ రోజు పాఠశాలలో వండిన ఆహారాన్ని ల్యాబ్‌కు తరలించారు. ఆ భోజనంలో కనుక విషం ఉన్నట్లు తేలితే.. తాము తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

loader