71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బొల్సొనారో హాజరయ్యారు.

Also Read:రిపబ్లిక్ డే 2020 : దేశం మనదే..తేజం మనదే..ఎగురుతున్న జెండా మనదే...

ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రిర రాజ్‌నాథ్ సింగ్ అమరవీరులకు నివాళులర్పించారు.

Also Read:జైట్లీ, సుష్మా స్వరాజ్ లకు పద్మ విభూషణ్: పీవీ సింధుకు పద్మభూషణ్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్యం ఇతర రక్షణ విభాగాలకు చెందిన అధికారులకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సైనిక దళాలు చేసిన విన్యాసాలను ఆకట్టుకున్నాయి.