Viral Video:ఒడిశా ఓ  వృద్ధురాలు తన పెన్షన్ కోసం విరిగిన కుర్చీ సాయంతో పలు కిలోమీటర్లు నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  

Viral Video: మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో కొత్త వీడియోలను చూస్తుంటాం.. ఈ వీడియోల్లో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని ఆందోళన కలిగిస్తుంటాయి. అలాగే, ఈ రోజు ఓ వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాకు చెందినది. ఇందులో 70 ఏళ్ల వృద్ధురాలు తన పెన్షన్ కోసం విరిగిన కుర్చీతో రోడ్డుపై చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. జిల్లాలోని ఝరిగన్ బ్లాక్‌లోని బానుగూడ గ్రామానికి చెందిన వృద్ధురాలిని సూర్య హరిజన్‌గా గుర్తించారు. వీడియోలో వృద్ధ మహిళ చాలా బలహీనంగా ఉంది. అయినా.. పెన్షన్ కోసం కిలోమీటర్ల కొద్ది ఎన్నో ఇబ్బందులు పడుతూ.. నడిచిన తీరు హృదయ విదారకంగా ఉంది. 

సూర్యా హరిజాన్ జీవించాలంటే.. ఆమెకు పింఛను తీసుకోవడం తప్పనిసరి. నడవడానికి చేతగాకపోయినా.. కానీ, అంతా దూరం నడవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలోనూ విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీని ఆసరాగా చేసుకుని, ఆ వృద్ధురాలు రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇతరులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె పెద్ద కుమారుడు ఇతర రాష్ట్రంలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. దీంతో ఆమె తన చిన్న కుమారుడి వద్దే ఉంటోంది. చిన్న కుమారుడు గ్రామంలోనే ఉంటూ..పశువుల కాపరిగా.. కూలీగా కాలమెల్లాదీస్తున్నాడు. పింఛను కోసం ఆ వృద్ధురాలు అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లినప్పటికీ ఆమెకు ఆ డబ్బు చేతికి రాకపోవడం దయనీయం.

వీడియో వైరల్ కావడంతో, SBI బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, ఆమె చేతి వేళ్లు స్కాన్ కావడం లేదు. అందువల్ల డబ్బు విత్‌డ్రా చేయడంలో ఇబ్బంది ఏర్పడింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. సమాచారం ప్రకారం.. మహిళ గత నాలుగు నెలలుగా తన పింఛన్ ను తీసుకోలేదు. ఆ మహిళ కాలికి ఆర్థోపెడిక్ గాయం ఉంది. దాని కారణంగా ఆమె చాలా నడవడానికి ఇబ్బంది పడుతోంది. పింఛను కోసం ఆమె బ్యాంకులో హాజరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 

ఒడిశాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో 43.2 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎండలో అడుగు పెట్టడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితిలో వృద్ధురాలు నడవడం చాలా అవమానకరం. ఈ వీడియో వైరల్ కావడంతో .. పలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

Scroll to load tweet…