హిమాచల్ ప్రదేశ్‌లో 70 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలోని తషిగంగ్‌లో 100 శాతం పోలింగ్ నమోదైంది.హిమాచల్ ప్రదేశ్‌లో 70 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలోని తషిగంగ్‌లో 100 శాతం పోలింగ్ నమోదైంది.
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. మళ్లీ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌కు ఈ సారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని హస్తం పార్టీ చెబుతున్నది. ఈ రాష్ట్ర అసెంబ్లీకి శనివారం ఎన్నికలు జరిగాయి. ఒక వైపు ఎముకలు కొరికే చలి అయినా పోలింగ్ సిబ్బంది, ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ వంతు బాధ్యతలు నిర్వర్తించాయి.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 70 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు 66.58 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కానీ, రాత్రి 11 గంటల వరకు ఈ శాతం 70 దాటినట్టు తెలుస్తున్నది.
ప్రపంచంలోన అతి ఎత్తైన ప్రదేశంలో పోలింగ్ కేంద్రం మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో తషిగంగ్ గ్రామంలో ఉన్నది. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పోలింగ్ కేంద్రంలో 52 ఓట్లు పడటంతో వంద శాతం పోలింగ్ నమోదైంది.
Also Read: హిమాచల్ లో మళ్లీ బీజేపీదే అధికారం.. రాహుల్ గాంధీపై జేపీ నడ్డా విమర్శలు
పోలింగ్ సిబ్బంది ట్రెక్కింగ్ చేసుకుంటూ ఏ కొంత అలసట కనిపించినా వెంటనే గంటల పాటు కూలపడిపోయి సేద తీరుతున్న వీడియోలు కనిపించాయి. కానీ, వారి వెంటే ఉన్న సామగ్రిని వదిలేయలేదు.
తామే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ పేర్కొంది. బీజేపీ సునాయసంగానే మెజార్టీతో గెలుస్తుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. అంతేకాదు, సీఎం అభ్యర్థిగా జైరాం ఠాకూర్‌ను కొనసాగించడాన్ని పేర్కొన్నారు. అంతేకాదు, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమకు ఆశీర్వాదం కోరుతూ డబుల్ ఇంజిన్ సర్కారును మళ్లీ వెనక్కి తీసుకువస్తామని వివరించారు.
