లోయలో పడిన బస్సు : ఏడుగురు మృతి,8 మందికి సీరియస్

7 killed in road accident at coonoor
Highlights

ఘోర రోడ్డు ప్రమాదం


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ సమీపంలోని కూనూరు వద్ద గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఏడుగురు మరణించారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడ్డారు.


కూనూరు వద్ద  50 మందితో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణీకుల్లో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో సుమారు 15 మంది గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రానికి చెందని ఆర్టీసీ బస్సు ఊటీ నుండి కన్నూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.


 

loader