7 Kashmir university students arrested: ప్రపంచకప్‌లో భారత్ ఓటమి తర్వాత కాశ్మీర్ లో ఏడుగురు విద్యార్థుల అరెస్ట్

భారత,అస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచులో భారత్ ఓటమి పాలైంది.ఈ పరిణామం కాశ్మీర్ లోని  వ్యవసాయ యూనివర్శిటీలో  విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణమైంది. ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు.

7 Kashmir university students arrested, booked under UAPA over campus face-off after World Cup final lns

న్యూఢిల్లీ: ప్రపంచకప్ పురుషుల క్రికెట్ కప్ ఫైనల్ పోటీల్లీ భారత జట్టుపై అస్ట్రేలియా  విజయం  సాధించిన విషయం తెలిసిందే. అయితే  అస్ట్రేలియా విజయం తర్వాత  పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని  విద్యార్థి ఫిర్యాదు మేరకు  కాశ్మీర్ లోని  వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు  విద్యార్ధులను చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు వారిని అరెస్ట్ చేశారు.

నవంబర్ 19వ తేదీ  రాత్రి సెంట్రల్ కాశ్మీర్ లోని గందర్ బాల్ లోని షుహామా వద్ద ఉన్న  షేర్ ఇ కశ్మీర్ యూనివర్శిటీ  ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌కెయుఎఎస్‌టీ) వెటర్నరీ  సైన్సెస్ ఫ్యాకల్టీ  హాస్టల్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణ తర్వాత ఓ విద్యార్థి ఈ ఫిర్యాదు చేశారు.

ఈ కేసు నమోదు కావడంతో  ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎస్‌కేయుఏఎస్‌టీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ అబూబకర్ అహ్మద్ సిద్దిఖీ  ధృవీకరించారని  జాతీయ మీడియా  ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

ఈ నెల  19వ తేదీన  అస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో  భారత జట్టు ఓటమి పాలు కావడంతో అండర్ గ్రాడ్యుయేట్ హస్టల్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందని  వెటర్నరీ  సైన్సెస్ ఫ్యాకల్టీ అధికారి  ఒకరు తెలిపారని ఆ పత్రిక కథనం తెలిపింది.

ఈ హస్టల్ లో సుమారు  300 మంది విద్యార్థులున్నారు.  ఇందులో  30 నుండి  40 మంది పంజాబ్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలకు చెందినవారిన హస్టల్ అధికారులు తెలిపారు.

అస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో  భారత జట్టు ఓడిపోవడంతో   కాశ్మీర్ కు చెందిన కొందరు విద్యార్థులు సంబరాలు చేసుకున్నారని  ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు  ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై  వార్డెన్ లేదా  యూనివర్శిటీ  అధికారికి  విద్యార్థి ఫిర్యాదు చేయలేదు.  నేరుగా  ఓ విద్యార్థి పోలీసులను ఆశ్రయించారు. 

ఈ విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా  జమ్మూకాశ్మీర్ పోలీసులు ఏడుగురు విద్యార్థులపై  ఉపా చట్టం కింద, ఐపీసీ 505 సెక్షన్ల కింద  కేసులు నమోదు చేశారు. ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఏడుగురు విద్యార్థుల పేర్లను ఓ విద్యార్థి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనను కాల్చి చంపుతామని  కూడ విద్యార్థులు బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత విద్యార్థి  ఆరోపించారు. అంతేకాదు  పాకిస్తాన్ అనుకూల నినాదాలు కూడ చేశారని  కూడ ఆ విద్యార్థి పోలీసుల దృష్టికి తెచ్చారు.ఈ పరిణామం  జమ్మూకాశ్మీర్ రాష్ట్రేతర విద్యార్థుల్లో భయానికి కారణమైందని  అతను ఆరోపించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా  హస్టల్ కు చేరుకున్న పోలీసులు ఏడుగురు విద్యార్థులను అప్పగించాలని  ఎస్‌కెయుఏఎస్‌టీ అధికారిని  కోరారు.  ఈ ఏడుగురు విద్యార్థులను  అదుపులోకి తీసుకున్నారు. వీరిని  గండేర్బల్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.  పోలీసులు యూనివర్శిటీ  అధికారులతో టచ్ లో ఉన్నారు. అరెస్టైన  విద్యార్థులు  బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు.

అస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్  కాశ్మీర్ లోని  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘర్షణకు కారణమైంది. ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో  భారత జట్టు ఓడిపోవడంతో  కొందరు విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. మరికొందరు  పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఓ విద్యార్థి ఫిర్యాదు మేరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios