Asianet News TeluguAsianet News Telugu

ఫంక్షన్ నుంచి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం..

రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

7 dead in road accident in Rajasthan Hanumangarh ksm
Author
First Published Oct 29, 2023, 12:00 PM IST

రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. వీరంతా శనివారం రాత్రి కుటుంబంతో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హనుమాన్‌ఘర్‌లోని సర్దార్‌షహర్ మెగా హైవేలోని లఖువాలి షెర్‌ఘర్ గ్రామం వద్ద బాధితులు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను పరమజీత్ కౌర్ (60), ఖుష్వీందర్ సింగ్ (25), అతని భార్య పరంజీత్ కౌర్ (22), కుమారుడు మంజోత్ సింగ్ (5), రాంపాల్ (36), అతని భార్య రీనా (35), కుమార్తె రీత్‌ (12)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆకాశ్‌దీప్ సింగ్ (14), మన్‌రాజ్ కౌర్ (2)గా గుర్తించారు. గాయపడిన వారికి బికనీర్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టుగా పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios