Asianet News TeluguAsianet News Telugu

ల‌క్ష‌ణాలు లేకుంటే హోం ఐసోలేషన్ 7 రోజులు సరిపోతుంది.. కేంద్రం కొత్త గైడ్ లైన్స్..

పాజిటివ్ తేలిన వ్యక్తికి వరుసగా 3 రోజుల పాటు ఫీవర్ రాకపోతే, ఇతర లక్షణాలు లేకపోతే 7 రోజుల పాటు హోం ఐసోలేషన్ సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. పలు నిబంధనలు వెల్లడించింది. 

7 days is enough for home isolation without symptoms .. Center New Guidelines ..
Author
Delhi, First Published Jan 6, 2022, 12:39 PM IST

కోవిడ్ -19 (covid-19) కేసులు పెరుగుతున్నాయి. దేశంలోకి గ‌త నెల ప్ర‌వేశించిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. గ‌త ఐదు నెల‌లుగా త‌గ్గుముఖం ప‌ట్టిన కరోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. అయితే డెల్టా వేరియంట్ తో పోలిస్తే, ఒమిక్రాన్ వేరియంట్ స్వ‌ల్ప తీవ్ర‌త‌ను, స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని అధ్య‌యనాలు చెబుతున్నాయి. ఇది కొంత ఊర‌ట‌నిచ్చే అంశం. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది. 

ఒమిక్రాన్ పై సైన్యానికి రక్షణశాఖ మార్గదర్శకాలు...ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచన...

కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన నూత‌న మార్గద‌ర్శ‌కాల ప్ర‌కారం.. క‌రోనా పాజిటివ్ గా తేలిన వ్య‌క్తి హోం ఐసోలేష‌న్‌లో ఏడు రోజులు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. గ‌తంలో ఈ నిబంధ‌న‌లు 14 రోజులుగా ఉండేది. అయితే ఇవి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు లేదా అస‌లు లక్ష‌ణాలు లేని వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. దీంతో పాటు మ‌రికొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా ఇందులో పొందుప‌ర్చింది. పాజిటివ్‌గా తేలిన వ్య‌క్తి ఐసోలేస‌న్ స‌మ‌యంలో వ‌రుస‌గా 3 రోజుల పాటు ఫీవ‌ర్ రాక‌పోతే 7 రోజుల పాటు హోం ఐసోలేష‌న్ స‌రిపోతుంద‌ని తెలిపింది. ఐసోలేష‌న్ పూర్త‌యిన త‌రువాత ల‌క్ష‌ణాలు లేక‌పోతే మ‌ళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిన అవ‌స‌రం లేదని చెప్పింది. అయితే త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ఎప్పుడూ ధ‌రించి ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. 

క‌రోనా పాజిటివ్ గా తేలిన వ్య‌క్తికి స‌హాయంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వ్య‌క్తి ఉండ‌వ‌చ్చ‌ని సూచించింది. ఈ వ్య‌క్తి రోగికి, డాక్ట‌ర్ కు మ‌ధ్య క‌మ్యూనికేట్ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పింది. అలాగే పాజిటివ్ వ్య‌క్తికి ద‌గ్గ‌ర‌గా ఉండి, ఎలాంటి ల‌క్ష‌ణాలు లేని వ్య‌క్తులు టెస్ట్ లు చేయించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది. కాక‌పోతే త‌ప్పనిస‌రిగా హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని తెలిపింది. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న పాజిటివ్ వ్య‌క్తి లో ఆక్సిజ‌న్ 93 శాతం క‌న్నా త‌క్కువ‌గా న‌మోదైతే వెంట‌నే డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని చెప్పింది. పాజిటివ్ వ్య‌క్తి ఎలాంటి అస్వ‌స్థ‌త‌కు గురి అయినా, ఛాతిలో నొప్పి అనిపించినా హాస్పిట‌ల్‌కు వెళ్లాల‌ని తెలిపింది. 

భారీగా పడిపోతున్న చికెన్, గుడ్ల ధరలు.. కారణం ఏంటంటే...

హో ఐసోలేష‌న్ లో ఉన్న వ్య‌క్తి డాక్ట‌ర్ల సూచ‌న మేరకే వైద్యం తీసుకోవాలని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే, ఇత‌ర సొంత వైద్యానికి దూరంగా ఉండాలని తెలిపింది. డాక్ట‌ర్లు నిర్దేశించిన విధంగానే వైద్యం అందుకోవాలి. అలాగే పాజిటివ్ గా తేలిన వ్య‌క్తులు డాక్ట‌ర్ల నిర్ధారించిన త‌రువాత మాత్ర‌మే హోం ఐసోలేష‌న్ లో ఉండాలి. వృద్ధులు, ధీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఈ నిబంధ‌న‌లు క‌చ్చితంగా వ‌ర్తిస్తాయి. డాక్ట‌ర్ల‌ను అడ‌గ‌కుండా ఎలాంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోకూడ‌దు. 

రోగికి సేవ‌లు అందించే వ్య‌క్తి ఆయా జిల్లాలోని, డివిజ‌న్ లోని కోవిడ్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ నెంబ‌ర్ అందించాలి. ఇలా ఇవ్వ‌డం వ‌ల్ల కంట్రోల్ రూం నుంచి రోగిని నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచ‌డం వీల‌వుతుంది. రోగికి అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు ప్ర‌భుత్వం నుంచి అందించే వీలుంటుంది. అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు  రోగికి సేవ‌లు అందించే వ్య‌క్తి కూడా కంట్రోల్ రూమ్ కు కాల్ చేయ‌వ‌చ్చు. స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌వ‌చ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios