Asianet News TeluguAsianet News Telugu

గోవా క్రూయిజ్ షిప్‌లో కరోనా పంజా.. 2000 మందికి టెస్టులు.. 66 మందికి పాజిటివ్.. ‘ఇప్పుడే వారిని అనుమతించం’

నూతన సంవత్సర సంబురాలు జరుపుకోవడానికి సుమారు 2000 మంది క్రూయిజ్ షిప్‌లో ముంబయి నుంచి గోవాకు బయల్దేరి వెళ్లారు. ఒక వైపు ఒమిక్రాన్ ముప్పు ఉన్నప్పటికీ ఈ సెలెబ్రేషన్స్ ఆగలేవు. ముంబయి నుంచి గోవా తీరం చేరగానే అధికారులు పీపీఈ కిట్ ధరించి షిప్ ఎక్కారు. అందరికీ కరోనా టెస్టులు చేశారు. ఇందులో 66 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలోనే వారిని ఇప్పుడే రాష్ట్రంలోకి అనుమతించాలా? లేదా? అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు.

66 tested positive on cruise ship in goa
Author
Panaji, First Published Jan 3, 2022, 6:38 PM IST

పనాజీ: వారంతా సముద్రంలో క్రూయిజ్ షిప్‌‌‌(Cruise Ship)లో నూతన సంవత్సర వేడుకలు(New Year Celebrations) చేసుకోవాలనుకున్నారు. ముంబయి(Mumbai) నుంచి గోవా(Goa)కు క్రూయిజ్ షిప్‌లో ప్రయాణం చేశారు. ఒక వైపు కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) విజృంభిస్తున్న తరుణంలోనే వారు క్రూయిజ్ షిప్‌లో నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. తాజాగా, గోవా తీరానికి చేరుకున్నారు. ఆ షిప్‌లో సుమారు 2000 మంది ప్రయాణిస్తున్నారు. ముందు జాగ్రత్తగా అందులోని ప్రయాణికులకు కరోనా టెస్టులు చేశారు. వారందరికీ కరోనా టెస్టులు చేశారు. ఇందులో 66 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు వారిని పడవ దిగకుండా ఆపారు. వారిని రాష్ట్రంలోకి అనుమతించాలా? లేదా? అనే విషయమై త్వరలో నిర్ణయిస్తామని గోవా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు. ప్రస్తుతం ఆ షిప్‌లో గోవాలోని మొర్ముగావ్ పోర్టులో నిలిపారు.

కార్డెలియా క్రూయిజ్ షిప్‌లోని 2000 మంది ప్రయాణికులకు కరోనా టెస్టులు చేశామని, అందులో 66 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలిందని గోవా మంత్రి విశ్వజిత్ రాణే ట్వీట్ చేశారు. ఆ షిప్‌లోని ప్యాసింజర్లను అనుమతించాలా? లేదా? అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కొడుకు ప్రయాణిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు చేసింది ఈ షిప్‌లోనే కావడం గమనార్హం.

Also Read: ఒమిక్రాన్.. సాధారణ వైరల్ ఫీవర్ మాత్రమే.. కానీ, జాగ్రత్తగా ఉండాలి: యూపీ సీఎం యోగి

ఆ షిప్‌ పోర్టు వద్దకు చేరగానే కొందరు వైద్య సిబ్బంది పీపీఈ కిట్‌లు ధరించి అందులోకి ఎక్కారు. అందులోని ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకలకు దేశవ్యాప్తంగా చాలా మంది గోవా బీచులకు వెళ్లి వేడుకలు చేసుకుంటుంటారు. ఈ ఏడాది కూడా ఒమిక్రాన్ ముప్పు ఉన్నప్పటికీ పలువురు గుంపులుగా బీచ్‌లకు చేరారు. 

తొలిసారిగా క్రూయిజ్ షిప్‌లో కరోనా పంజా విసిరిన ఉదంతం 2020 జనవరిలో జపాన్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ మొత్తం షిప్‌నే సముద్ర జలాల్లోనే క్వారంటైన్ చేశారు. జపాన్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ షిప్‌లో ప్రయాణించిన సుమారు 700 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

Also Read: ఒమిక్రాన్ వేవ్ మొదలైంది.. 84శాతం కేసులు కొత్త వేరియంట్‌తోనే.. వారంలో పీక్‌కు.. : ప్రభుత్వం

సోమ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుత వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 33,750 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డ‌వారి సంఖ్య 3,49,22,882 కు చేరింది. నిన్న‌టితో పోలిస్తే.. 22 శాతం కొత్త కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్ర‌స్తుతం 1,45,582 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో కొత్త‌గా 10,846 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,95,407కు పెరిగింది. ఆదివారం కొత్తగా 123 ఒమిక్రాన్‌ కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 1700కు చేరింది. ఇప్పటివరకు 639 మంది కోలుకున్నారు. దేశంలోని ఒమిక్రాన్‌ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో 510 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఢిల్లీ 351, కేరళ 156, గుజరాత్‌ 136, తమిళనాడు 121, రాజస్థాన్‌ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 చొప్పున ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.  నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios