న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం చేసేందుకు రూ. 65 వేల కోట్లు అవసరమని ప్రముఖ ఆర్ధిక నిపుణులు రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. 

గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో  రఘురామ్ రాజన్ తో వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు.సుధీర్ఘకాలం లాక్ డౌన్ భారతదేశ ఆర్ధిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.

రూ. 65 వేల కోట్లు దేశంలోని పేదల జీవితాలను నిలిపేందుకు అవసరమని  ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకు రఘురామ్ రాజన్ హిందీలో సమాధానం చెప్పారు.లాక్ డౌన్ ఎప్పటికి కొనసాగించడం సులువే, కానీ ఆర్ధిక వ్యవస్థకు ఇది సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్ ఎత్తివేసే సమయంలో తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సుధీర్ఘకాలం పాటు ప్రజలకు ఆహారాన్ని ఇవ్వడం మనకు సాధ్యం కాదని రాజన్ చెప్పారు.

also read:ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి, అలా ఉంటే ఆఫీసుకి రావొద్దు: ఉద్యోగులకు కేంద్రం ఆదేశం...

రఘురామన్ రాజన్ చికాగో యూనివర్శిటిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. 2013లో ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా నియమితులయ్యారు. 30 నిమిషాల పాటు రాహుల్ గాంధీ, రాజన్ మధ్య వీడియో కాన్పరెన్స్ సాగింది. అమెరికా, ఇండియా మధ్య కరోనా నివారణ చర్యలపై చర్చ సాగింది.