షాక్: డాక్టర్‌పై వృద్దుడి అత్యాచారయత్నం, చివరికిలా...

61-yr-old molests and attacks doctor with hammer, commits suicide in Mumbai
Highlights

ఇంట్లో ఒంటరిగా ఉన్న డాక్టర్‌పై  సీనియర్ సిటిజన్  అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే  ఆమెపై దాడి చేసి  నిందితుడు తప్పించుకొన్నాడు.  అంతేకాదు నిందితుడిని  పోలీసులు అరెస్ట్ చేసే లోపుగా  ఆత్మహత్య చేసుకొన్నాడు. 


ముంబై: ఇంట్లో ఒంటరిగా ఉన్న డాక్టర్‌పై  సీనియర్ సిటిజన్  అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే  ఆమెపై దాడి చేసి  నిందితుడు తప్పించుకొన్నాడు.  అంతేకాదు నిందితుడిని  పోలీసులు అరెస్ట్ చేసే లోపుగా  ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

మహారాష్ట్రలోని గోరేగావ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ డాక్టర్ తన తల్లితో కలిసి నివాసం ఉంటుంది.  పక్కింట్లోనే 65 ఏళ్ల వృద్దుడు కూడ నివాసం ఉంటున్నాడు.  డాక్టర్ ఎక్కడికి వెళ్లినా  ఆమెకు తెలియకుండానే ఆ వృద్దుడు అనుసరించేవాడు. 

సీనియర్ సిటిజన్ పక్కింట్లో నివాసం ఉండేవాడు... అందుకే ఈయన గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. పెద్దాయన ప్రవర్తనను అంచనావేయలేదు.  ఆదివారం నాడు బాధితురాలు ఇంట్లో ఒక్కతే ఉన్న విషయాన్ని గుర్తించిన నిందితుడు ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించింది.

దీంతో బాధితురాలి తల, కాలిపై సుత్తితో కొట్టాడు.  ఆమె గట్టిగా కేకలు వేసింది.  దీంతో పక్కనే ఉన్న వాళ్లు వచ్చి ఆమెను కాపాడారు. అయితే నిందితుడు తప్పించుకొని  పారిపోయాడు.  అయితే ఈ ఘటనకుపాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  పోలీసులు అరెస్ట్ చేసే లోపుగానే  నిందితుడు  ఓ షాపింగ్ కాంప్లెక్స్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


 

loader