మనవరాలిపై తాత అత్యాచారం, హత్య: పట్టిచ్చిన డాగ్ స్క్వాడ్

First Published 21, Jun 2018, 12:17 PM IST
60-yr-old man rapes, kills his 4-yr-old granddaughter
Highlights

ఓ మానవ మృగం తన సొంత మనవరాలినే వేటాడింది.

రాయపూర్: ఓ మానవ మృగం తన సొంత మనవరాలినే వేటాడింది. నాలుగేళ్ల మనవరాలిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశాడు. ఈ సంఘటన ఛత్తీస్ గడ్ లోని కొండగావ్ లో జరిగింది.

హత్య చేసిన తర్వాత తాను పట్టుబడుతాననే భయంతో బాలిక శవాన్ని ఎండు గడ్డిలో దాచి పెట్టాడు. మనవరాలు మాయమైందంటూ నాటకాలు ఆడాడు. ఆ తర్వాత శవాన్ని తమ ఇంటి సమీపంలోని బురద గుంటలో పడేశాడు. 

నిందితుడిని అరెస్టు చేశామని, అతను నేరాన్ని అంగీకరించాడదని కొండగావ్ పోలీసు సూపరింటిండెంట్ అభిషేక్ పల్లవ్ చెప్పారు. ఈ సంఘటన జూన్ 11వ తేదీన జరిగింది. ఆడుకుంటున్న కూతురు కనిపించకపోవడంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

శవం దొరికిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో క్లూస్ ఏమీ దొరకలేదని, కేసును పరిష్కరించడం కష్టమైందని ఎస్పీ పల్లవ్ చెప్పారు.  సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ ను తీసునకి వెళ్లామని, రక్తంతో తడిసిన లుంగీని డాగ్ స్క్వాడ్ తవ్వి తీశాయని, ఆ తర్వాత నేరుగా మృతురాలి తాత వద్దకు వెళ్లాయని ఆయన చెప్పారు. దాంతో కేసు మిస్టరీ వీడిందని చెప్పారు.

loader