Asianet News TeluguAsianet News Telugu

కొడుకు వైద్యం కోసం వస్తే 60యేళ్ల మహిళతో బలవంతంగా కూలీపని.. ఆగ్రాలోని ఆస్పత్రి నిర్వాకం...

ఆస్పత్రిలో చేరిన కొడుకుకు అటెండెంట్ గా వచ్చిన ఓ మహిళ పట్ల అక్కడి సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. 60యేళ్ల వయసున్న ఆమెతో బలవంతంగా పెద్ద పెద్ద మందుల డబ్బాలను ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కు మోయించారు. 

60-year-old woman attendant of patient forced to carry boxes on her head In Agra
Author
First Published Oct 21, 2022, 11:58 AM IST

ఉత్తరప్రదేశ్ : ఆసుపత్రులు కొన్నిసార్లు చాలా కఠినంగా వ్యవహరిస్తాయి. బిల్లుల కోసం నిర్ధక్షిణ్యంగా ఉంటుంటాయి. అలాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కుమారుడికి చికిత్స చేసినందుకు గానూ 60యేళ్ల మహిళను కూలీపని చేయించారో ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. 

60 ఏళ్ల వృద్ధురాలి కుమారుడికి డ్రిప్ వేయడానికి బదులు కూలి పని చేయమని ఒత్తిడి తెచ్చిన ఈ ఘటన సంచలనం రేపింది. ఆమె కొడుకు శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. అతనికి ఆ హాస్పిటల్ లోని మానసిక వైద్య విభాగంలో వారాల నుంచి చికిత్స జరుగుతోంది. అతడిని చూసుకోవడానికి ఆ మహిళ అక్కడ ఉంది. అయితే ఆమెకు కూడా శారీరకంగా సమస్యలున్నాయి. 

భర్త లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్.. 9వ అంతస్తునుంచి దూకి భార్య ఆత్మహత్య.. దారుణం..

సదరు మహిళ తన తలపై మందుల పెట్టెలను మోసుకెల్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆసుపత్రి అధికారులు చర్యకు దిగారు. దీనికి ఉసిగొలిపిన సిబ్బందిపై విచారణకు ఆదేశించారు. దీనిమీద మహిళను ప్రశ్నించగా.. "నాకు కాలు ఆపరేషన్‌ అయ్యింది. రాడ్లు వేశారు. దీంతో నేను సరిగా నడవలేను.. ఆ విషయం చెప్పినా కూడా వారు నన్ను పక్కనున్న మూడంతస్తుల భవనం నుంచి మందుల బాక్సులను తీసుకురావాలని సిబ్బంది నన్ను బలవంతం చేశారు" అని ఆమె వైరల్ వీడియోలో పేర్కొంది.

ఈ విషయంపై రోగి కుటుంబ సభ్యులు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఈ విషయంపై విచారణకు ఆదేశించామని, నర్సింగ్‌ సిబ్బందిని వివరణ కూడా కోరామని, నర్సింగ్‌ సిబ్బంది దోషులని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, రాబోయే రెండు రోజుల్లో విచారణ నివేదిక అందజేయాలని కోరామని’’ ఆసుపత్రి సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios