Asianet News TeluguAsianet News Telugu

భర్త లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్.. 9వ అంతస్తునుంచి దూకి భార్య ఆత్మహత్య.. దారుణం..

కట్టుకున్న భార్యనే లైంగిక వేధింపులకు గురిచేశాడో కసాయి భర్త. అంతేకాదు బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు. దీంతో విరక్తి చెందిన ఆ భార్య ఆత్మహత్య చేసుకుంది. 

wife committed suicide over husband sexual harassment and blackmail in karnataka
Author
First Published Oct 21, 2022, 11:04 AM IST

కర్ణాటక : నిత్యం వేధించే భర్తతో విరక్తి చెందిన ఓ మహిళ అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి  వెడితే…ఉపాసన (30) ఆమె భర్త, రంజాన్ రావత్  దంపతులు ఉత్తరాధి నుంచి వలస వచ్చారు. దిశా అపార్ట్మెంట్లో 9వ అంతస్థులో అద్దె ఫ్లాట్లో ఉంటున్నారు. వీరికి తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లయింది.

వీరిద్దరూ వేర్వేరు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై తరచూ గొడవ పడేవారు. చివరికి విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్టు తెలిసింది. తన జీవితం ఏమాత్రం బాగాలేదని విరక్తి చెందిన ఉపాసన రావత్ బుధవారం సాయంత్రం తన ఫ్లాట్ వరండా నుంచి కిందకు దూకేసింది. తీవ్రగాయాలతో  అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి  భర్త రంజన్ రావత్ ను అరెస్టు చేశారు. 

టీవీ నటి వైశాలీ ఠక్కర్ ఆత్మహత్య కేసులో రాహుల్ నవలానీ అరెస్ట్..

సూసైడ్ నోట్ లో ఏముందంటే..
ఆమె ఇంగ్లీషులో రాసిన ఆరు లైన్ల సూసైడ్ నోట్ లో అసలు విషయాన్ని క్లుప్తంగా చెప్పింది. ఈ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా భర్త నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. అందుకే నేను చనిపోతున్నాను. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతనిని కఠినంగా శిక్షించాలని లేఖలో రాసింది.

ఇదిలా ఉండగా, ఏపీలో ఓ జంట లాడ్జీ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం, దూసి గ్రామానికి చెందిన దామోదర్, ఆముదాలవలస మండలం బలగాం గ్రామానికి చెందిన సంతోషి కుమారి (18) సోమవారం గొల్లలపాలెందరి అయ్యన్ ప్రెసిడెన్సీలో గది అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు హోటల్ గది నుంచి బయటికి  రాలేదు. మంగళవారం వారి బంధువు లాడ్జికి వచ్చి వారిఫోటో చూపించి ఏ గదిలో ఉన్నారో తెలుసుకున్నారు. రూమ్ దగ్గరికి వెళ్లి పిలిచినా.. తలుపు తట్టినా లోపలి నుంచి ప్రతిస్పందన రాలేదు. 

దాదాపు గంట పాటు వేచి చూసిన తర్వాత వారు లాడ్జి సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే లాడ్జి సిబ్బంది తలుపులు తెరచి చూసేటప్పటికీ బాత్రూం కిటికీకి తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో లాడ్జి సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ  సోమశేఖర్ ఆదేశాల మేరకు  ఎస్ఐలు చంద్రశేఖర్, విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వారి గదిలో ఇంటర్,డిగ్రీ సర్టిఫికెట్లు, కొన్ని పత్రాలు లభించగా వారు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.

రజక కులానికి చెందిన వీరిద్దరి మధ్య ఇటీవల ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దామోదర్ కుల వృత్తి చేసుకుంటుండగా, సంతోషి కుమారి నర్స్ గా పనిచేస్తున్నట్లు  గుర్తించారు. అమ్మాయి మెడలో తాళి కనబడటంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఉరి వేసుకుని నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి బంధువుల ద్వారా ఇద్దరి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు బుధవారం నగరానికి  రానున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios