రాజధానిలో మరో దారుణం, ఆరేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

6-Year-Old Homeless Girl Kidnapped, Raped By Drug Addict In Delhi
Highlights

దేశ రాజధాని డిల్లీలో మహిళలకే కాదు చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. కామాంధుల చేతిలో కేవలం మహిళలే కాదు చిన్నారులు కూడా బలవుతున్న అనేక సంఘటనలు దేశ రాజధానిలో బైటపడ్డ విషయం తెలిసిందే. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో తాజాగా మరో దారుణ ఘటన బైటపడింది. ఓ ఆరేళ్ల చిన్నారిపై 24ఏళ్ల యువకుడు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డిల్లీ మింట్ రోడ్డు లోని ఖాళీ మందిర్ వద్దగల ఫుట్ పాత్ పై ఓ కుటుంబం నివసిస్తోంది. భర్త రిక్షా నడుపుతుండగా, భార్య గుడి వద్ద బిక్షాటన చేస్తుంటుంది. అయితే వీరు ఈ పనులపై వెళ్లిపోగా వారి ఏడేళ్ల చిన్నారి మాత్రం అదే ఫుట్ పాత్ ఒంటరిగా ఉండేది.

అయితే ఇదే ఫుట్ పాత్ పై ఓ 24ఏళ్ల అనాధ బాలుడు కూడా నివసించేవాడు. ఇతడు డ్రగ్స్ కు బానిసై జులాయిగా తిరిగుతూ ఉండేవాడు. ఇతడు గత కొన్ని రోజులుగా చిన్నారి తల్లిదండ్రులు బైటికి వెళ్లడంతో ఒంటరిగా ఉండే పాపపై కన్నేశాడు. దీంతో ఈ నెల 14న ఫుల్లుగా డ్రగ్స్ తీసుకుని వచ్చిన అతడు అక్కడే ఫుట్ పాత్ పై ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేశాడు. పాపను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా రేప్ చేశాడు. చిన్నారి అరవకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఈ  దారుణానికి పాల్పడ్డాడు.

అయితే పనులు ముగించుకుని ఫుట్ పాత్ వద్దకు వచ్చిన తల్లిదండ్రులు కూతురు కనిపించకపోవడంతో కంగారుపడి చుట్టుపక్కల వెతికారు. వారి నివాస ప్రాంతానికి దగ్గర్లోని పొదల్లో చిన్నారి రక్తపు మడుగులో పడివుండడాన్ని వారు గుర్తించారు. మర్మావయవాల్లోంచి తీవ్రంగా రక్త స్రావం అవుతుండటంతో అత్యాచారం జరిగినట్లు గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరిస్థితి విషయమంగా ఉన్నట్లు సమాచారం.

loader