మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి కరేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడోరా గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిపై పోలీసులు ₹ 10,000 రివార్డ్ ప్రకటించారు .
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఆరు ఏళ్ల బాలిక మృతదేహం ప్రత్యేక్షమైంది. అమాయక చిన్నారి బట్టలు చిందరవందరగా.. చినికి ఉండటంతో ఆ చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వ్యక్తికి 10 వేల రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన శివపురి జిల్లాలోని కరైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడోరా గ్రామానికి చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం..శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు, బడోరా గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్లింది. అయితే.. ఆ బాలిక తన తల్లికి చెప్పకుండా అక్కడి నుంచి బయటకు వెళ్లింది. అయితే.. ఎంతకీ తన కూతురు తన వద్దకు రాకపోయే సరికి..ఇంటికి వెళ్లి.. ఉండవచ్చని భావించింది. కానీ.. ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో కంగు తిన్నది.
తన నివాసానికి సమీప ప్రాంతాల్లో వెతికింది. తనతో పాటు తన చుట్టు ప్రక్కల వారు, బంధువులు కలిసి ఆ చిన్నారి కోసం వెతికారు. అయినా.. ఫలితం లేదు. దీంతో ఆ తల్లి కరైరా పోలీసులను ఆశ్రయించింది. తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న పొలంలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి.. తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శవాన్ని పోస్టు మార్టం కోసం తలించారు.
హత్యలో పరిచయస్తుల ప్రమేయం
బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఆగ్రహించిన బంధువులు.. తిలా-బదౌరా రహదారిని దిగ్బంధించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం కలెక్టర్ రవీంద్రకుమార్ చౌదరితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ సింగ్ చందేల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో పరిచయస్తుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు తన గుర్తింపు బయటపడుతుందనే భయంతో బాలిక హత్య చేసి ఉండవచ్చనని భావిస్తున్నారు. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.
పదివేల రివార్డు
చిన్నారి అదృశ్యమైన ఫిర్యాదు శుక్రవారం రాత్రి సమయంలో అందినట్టు శివపురి ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు. పోలీసులు వెతకగా.. శనివారం ఉదయం ఆవాల పొలంలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకుని విచారణకు జిల్లా స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. పోస్ట్‌మార్టం బట్టి మరిన్ని సెక్షన్లు కేసులో పెంచే అవకాశముంది. అదే సమయంలో నిందితుడిపై పోలీసులు రూ.10,000 రివార్డు ప్రకటించారు.
