అలర్ట్: భారత్‌లోనూ AY.4.2 వేరియంట్ జాడలు ... మధ్యప్రదేశ్‌లో ఆరుగురిలో గుర్తింపు

మధ్యప్రదేశ్‌లోని (madhya pradesh) ఇండోర్‌కు (indore) చెందిన ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 (AY.4. 2)అనే కొత్త వేరియంట్‌ సోకినట్లు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ (vaccine) తీసుకున్నవారే కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మధ్యప్రదేశ్‌లో కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన విషయాన్ని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం కూడా ధ్రువీకరించింది.

6 Persons Found Infected with AY.4 Variant of Coronavirus in Madhya Pradesh

ప్రపంచాన్ని కరోనా ముప్పు వీడటం లేదు. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ మానవాళిపై పంజా విసురుతూనే వున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాలను కొత్త రకం వేరియంట్లు వణికిస్తున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే కోవిడ్ పడగ నీడ నుంచి బయటపడుతున్న భారత్‌కు మహమ్మారి మరో షాకిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని (madhya pradesh) ఇండోర్‌కు (indore) చెందిన ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 (AY.4. 2)అనే కొత్త వేరియంట్‌ సోకినట్లు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ (vaccine) తీసుకున్నవారే కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. మధ్యప్రదేశ్‌లో కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన విషయాన్ని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం కూడా ధ్రువీకరించింది. జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకునేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపినట్టు మధ్యప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. చికిత్స అనంతరం బాధితులంతా కోలుకున్నారని ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే వున్నారని డాక్టర్లు తెలిపారు. 

కాగా.. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఏవై 4.2రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. డెల్టా ఉపవర్గమైన AY.4. 2 కరోనా కేసులు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)ను వణికిస్తున్నాయి. UK, Russia, Israelలో కూడా ఈ కొత్తరకం వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ లో తొలిసారిగా భారత్ లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్ లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. కానీ, అవేవీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. తాజాగా AY.4. 2 వ్యాప్తి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేరియంట్ తొలిసారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరోనా వైరస్ లోని Spike protein మ్యుటేషన్లు అయిన A222V, Y145Hల సమ్మేళనంగా ఈ కొత్త వేరియంట్ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Also REad:Delta Variant AY 4.2 : యూకేను వణికిస్తున్న కొత్త రకం వేరియంట్

బ్రిటన్‌లో (britain) రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గతవారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 52,009 కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసుల పెరుగుదలని నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్ ప్రధానమంత్రి Boris Johnson చెప్పారు. ఇటీవలి కాలంలో యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ లో 96 శతం ఏవై 4.2 వేరియంట్ వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా లండన్ జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్ వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios