Delta Variant AY 4.2 : యూకేను వణికిస్తున్న కొత్త రకం వేరియంట్

Delta Variant తరహాలో మరేది ఇప్పటివరకు వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు డెల్టా ఉపవర్గమైన AY.4. 2 కరోనా కేసులు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)ను వణికిస్తున్నాయి.

All about Delta variant AY.4.2 that is increasing COVID-19 infections in UK, Russia, Israel

లండన్ : కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా వేరియంట్ ఉపవర్గమైన ఏవై 4.2రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండేళ్లుగా కరోనా వైరస్ లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

అయితే Delta Variant తరహాలో మరేది ఇప్పటివరకు వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు డెల్టా ఉపవర్గమైన AY.4. 2 కరోనా కేసులు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)ను వణికిస్తున్నాయి.

UK, Russia, Israelలో కూడా ఈ కొత్తరకం వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ లో తొలిసారిగా భారత్ లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్ లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. 

కానీ, అవేవీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. తాజాగా AY.4. 2 వ్యాప్తి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేరియంట్ తొలిసారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరోనా వైరస్ లోని Spike protein మ్యుటేషన్లు అయిన A222V, Y145Hల సమ్మేళనంగా ఈ కొత్త వేరియంట్ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

నిత్యం 50 వేలకు పైగా కేసులు

బ్రిటన్ లో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గతవారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 52,009 కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసుల పెరుగుదలని నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్ ప్రధానమంత్రి Boris Johnson చెప్పారు. 

ఇటీవలి కాలంలో యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్ లో 96 శతం ఏవై 4.2 వేరియంట్ వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా లండన్ జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్ వెల్లడించారు. 

రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు, కేసులు

మాస్కో : Russiaలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో పాటు మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 37,141 కొత్త కేసులో నమోదు కాగా, 1,064 మరణాలు సంభవించినట్లు తెలిపింది. 

యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,28,453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్‌ ప్రజలను కోరారు. 

మాస్క్ ధరించకపోవడంతోనే కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యంత్రాంగం ప్రజా రవాణా వ్యవస్థను కూడా బంద్‌ చేయాలని యోచిస్తోంది. రాజధాని మాస్కోలోని స్కూళ్లు, సినిమా హాళ్లు, వినోద ప్రదేశాలు, స్టోర్లను ఈ నెల 28 నుంచి మూసి వేయనున్నారు. 

సెక్స్ వర్కర్‌తో ఉండగా పట్టుబడ్డ పియానిస్ట్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

పిల్లలకు Pfizer vaccine సురక్షితం... 
91% సమర్థంగా పనిచేస్తోందన్న కంపెనీ

అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ 5-11 యేళ్ల వయసు వారిలో 91శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఈ కంపెనీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 

పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమేనని తేలింది. ఇప్పటికే 12యేళ్ల పైబడిన వారికి అమెరికాలో టీకాలు ఇస్తున్నారు. 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి నవంబర్ నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్రిస్మస్ పండుగ నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి జో బైడెన్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios