Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ: ఆరుగురు మృతి,పది మందికి గాయాలు


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.
 

6 Dead, 10 Injured After Speeding Trolley Rams Into A Marriage Procession In Madhya Pradesh lns
Author
First Published Mar 12, 2024, 7:58 AM IST

న్యూఢిల్లీ:  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా రైజన్ జిల్లాలో సోమవారం నాడు రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు.రాంగ్ సైడ్ లో  నిర్లక్ష్యంగా ఓవర్ టేక్ చేస్తున్న ట్రాలీ పెళ్లి ఊరేగింపును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

also read:పరీక్షలో పాస్ చేయండి లేకపోతే పెళ్లి చేస్తారు: ఆన్సర్ షీట్ లో ఓ విద్యార్ధిని వేడుకోలు

జబల్ పూర్ జిల్లాలోని రైసన్ గ్రామంలో  వివాహ ఊరేగింపు  సాగుతుంది. భోపాల్-జబల్ పూర్ రోడ్డు వెంట  ఖమారియా ఘాట్ వద్ద 45 నెంబర్ జాతీయ రహదారిపై  వేగంగా వచ్చిన ట్రాలీ వివాహ ఊరేగింపును ఢీకొట్టింది.

also read:టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల షేరింగ్‌లో స్వల్పమార్పులు: ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

హోషంగాబాద్ జిల్లా అంచల్ ఖేడా నుండి పెళ్లి ఊరేగింపు ఖమారియాకు సోమవారం నాడు రాత్రి  10 గంటల సమయంలో చేరింది.  అదే సమయంలో  ట్రాలీ రాంగ్ రూట్ లో వచ్చి  పెళ్లి ఊరేగింపు నిర్వహిస్తున్నవారిపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.  పెళ్లి ఊరేగింపు సమయంలో  లైట్లు మోసే కూలీలు కూడ ఉన్నారని  సుల్తాన్ పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ రజత్ సారథే తెలిపారు.  ప్రమాదం జరిగిన తర్వాత ట్రాలీ డ్రైవర్ పారిపోయాడని  పోలీసులు ప్రకటించారు.

also read:రైలులో సీటు కోసం గొడవ: వ్యక్తిని నిలదీసిన మహిళలు, నెట్టింట వైరల్

ఈ విషయం తెలుసుకున్న  పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.వేగంగా  వాహనం నడపడం వల్ల అదుపు తప్పిందని స్థానికులు చెబుతున్నారు.  ఈ ప్రమాదంలో  మహిళలు, పిల్లలు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు

Follow Us:
Download App:
  • android
  • ios