టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల షేరింగ్‌లో స్వల్పమార్పులు: ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల షేరింగ్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ,బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఏ స్థానంలో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై మూడు పార్టీల నేతలు సోమవారం నాడు ఎనిమిది గంటలకు పైగా చర్చించారు.సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సీట్ల షేరింగ్ పై మూడు పార్టీల మధ్య చర్చలు జరిగాయి.
also read:చంద్రబాబు నివాసానికి బీజేపీ,జనసేన నేతలు: సీట్ల సర్ధుబాటుపై కీలక చర్చలు
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు పాండా, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ చర్చల నేపథ్యంలో సీట్ల షేరింగ్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
also read:నిడదవోలు నుండి జనసేన పోటీ: కందుల దుర్గేష్‌ను ప్రకటించిన పవన్ కళ్యాణ్
తొలుత బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అయితే ఎనిమిది గంటల సుదీర్ఘ చర్చల తర్వాత సీట్ల షేరింగ్ లో మార్పులు చోటు చేసుకున్నాయి.
గతంలో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే తమకు కేటాయించిన 24 స్థానాల్లో జనసేన మూడు స్థానాలను బీజేపీకి కేటాయించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగనుంది.మరో వైపు తెలుగుదేశం పార్టీ మరో అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దరిమిలా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. తొలుత బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించనున్నట్టుగా టీడీపీ ప్రకటించింది.అయితే నిన్న జరిగిన చర్చల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరింది.
also read:మమ్మల్ని రక్షించండి: ఇండియాను కోరిన రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న నేపాల్ వాసులు (వీడియో)
సోమవారం నాడు జరిగిన చర్చల తర్వాత మూడు పార్టీలు పోటీ చేసే స్థానాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది.తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. 10 అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది.
తిరుపతి, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. కాకినాడ, మచిలీపట్టణం ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు.