Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో రెచ్చిపోయిన దొంగలు:పట్టపగలు బ్యాంకు లూటీ

దేశరాజధాని ఢిల్లీలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలు ఆరుగురు ముసుగు దొంగలు ఓ బ్యాంకులో చొరబడి నానా హంగామా చేశారు. ఆయుధాలు ధరించి బ్యాంకులోకి చొరబడ్డారు. క్యాషియర్‌ను చంపి రూ.3 లక్షల సొమ్ముతో పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం నైరుతి ఢిల్లీలోని ఛావ్లా టౌన్ లో ఉన్న కార్పొరేషన్ బ్యాంకులో చోటు చేసుకుంది.
 

6 Armed Men Loot Rs. 3 Lakh, Kill Cashier In Delhi Bank. CCTV Captures All
Author
Delhi, First Published Oct 13, 2018, 8:00 PM IST

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలు ఆరుగురు ముసుగు దొంగలు ఓ బ్యాంకులో చొరబడి నానా హంగామా చేశారు. ఆయుధాలు ధరించి బ్యాంకులోకి చొరబడ్డారు. క్యాషియర్‌ను చంపి రూ.3 లక్షల సొమ్ముతో పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం నైరుతి ఢిల్లీలోని ఛావ్లా టౌన్ లో ఉన్న కార్పొరేషన్ బ్యాంకులో చోటు చేసుకుంది.

వివారాల్లోకి వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డును బలంగా కొట్టి అతని నుంచి తుపాకీ లాక్కోని బ్యాంకులోకి వెళ్లారు. నేరుగా బ్యాంకు క్యాషియర్ ను కాల్చి చంపారు. రూ.3లక్షల రూపాయలను పట్టుకెళ్లిపోయారు. ఎంత వేగంతో బ్యాంకులోకి చొరబడ్డారో అంతే వేగతంతో దొంగలు పరారయ్యారు. 

అయితే దొంగల బీభత్సం అంతా సీసీ టీవీలో రికార్డు అయ్యింది. 90 సెకెండ్లలో ఈ వ్యవహారం అంతా చోటు చేసుకుంది. గత దశాబ్ద కాలంలో ఈ తరహా దోపిడీ జరగడం ఇదే ప్రథమమని ఢిల్లీ వాసులు చెప్తున్నారు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాంకు సిబ్బందిని ఆరా తీశారు. అలాగే సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. బ్యాంకులోని ఆరుగురు సిబ్బంది సహా 16 మందిని దోపిడీ దొంగలు బందీలుగా పట్టుకుని, తుపాకులతో బెదరించారని పోలీసులు తెలిపారు. తొలుత బ్యాంకు క్యాషియర్‌ సంతోష్ నుంచి డబ్బులు లాక్కునేందుకు దొంగలు ప్రయత్నించారని, క్యాషియర్ నిరాకరించడంతో అతనిపై కాల్పులు జరిపారని తెలిపారు. 

క్యాషియర్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు తెలిపారు. సీసీటీపీ ఫుటేట్ ఆధారంగా సోనిపట్, నజఫ్‌డగ్ నుంచి దొంగలు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios