Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్...

ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తో సహా 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 

5th phase lok sabha elections 2019, live updates
Author
New Delhi, First Published May 6, 2019, 7:05 AM IST

ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్... 

ఐదో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్ లో మాత్రం కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా ఐదో విడతలో 51 నియోజకవర్గాల్లో పోటీచేసిన మొత్తం 674 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. ఈ ఎన్నికల్లో  రాహుల్ గాంధీ, స్మృతీ ఇరానీ పోటీ పడుతున్న అమేథీ లో కూడా ఈ విడతలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక సోనియా గాంధీ, రాజ్ నాథ్ సింగ్ వంటి ప్రముఖలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఇవాళే పోలింగ్ జరిగింది. 
 

నాలుగు గంటల  వరకు రాష్ట్రాలవారిగా పోలింగ్ శాతం

బిహార్-   44.08
జమ్మూకాశ్మీర్- 15.51
మధ్యప్రదేశ్- 53.84
రాజస్థాన్-  50.44
ఉత్తరప్రదేశ్- 44.89
బెంగాల్-  63.57
జార్ఖండ్- 58.07

రాహుల్ పై విరుచుకుపడ్డ  స్మృతీ ఇరానీ

అమేథీ ప్రజలను కాంగ్రెస్ అభ్యర్థి మరోసారి మోసం  చేశారని బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇక్కడి నుండే పోటీ చేస్తూ కనీసం పోలింగ్ రోజు కూడా రాకపోవడం అతడిలోని గర్వాన్ని  సూచిస్తుందన్నారు. ఇలా ఇక్కడి ప్రజలను అవమానించాల్సిన అవసరం అతడికి ఏమొచ్చిందంటూ స్మృతి ధ్వజమెత్తారు.   


ఓటేసిన సుబ్రతా రాయ్

సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లక్నోలోని ఓ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు. 

 

రాంచీలో ఓటేసిన ధోని దంపతులు 

ఐదో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా జార్ఖండ్ లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జార్ఖండ్  డైనమైట్ ధోని రాంచీలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసొచ్చిన ఆయన రాంచీలోని జవహార్ విద్యా మందిర్  పోలింగ్ బూత్ లో ఓటేశారు.    

 

 

 

ఒంటిగంట వరకు పోలింగ్ శాతం

బిహార్- 24.49%
జమ్మూకాశ్మీర్- 6.54%
మధ్యప్రదేశ్- 31.46%
రాజస్థాన్- 33.82%
ఉత్తరప్రదేశ్- 26.53%
బెంగాల్- 39.55%
జార్ఖండ్- 37.24%

పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని ఫోర్‌షోర్ రోడ్డులో ఉన్న పోలింగ్ బూత్‌ ఎదుట కూర్చొన్న బీజేపీ కార్యకర్తపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగినట్లుగా సమాచారం. 

పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీజాపూర్ బూత్ నెంబర్ 116లో కొంతమంది ఓటర్లు రెండుసార్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఉదయం మాక్‌పోల్‌లో నమోదైన 86 ఓట్లను తొలగించలేదన్న సంగతిని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో అధికారులు అప్పటి వరకు పడిన ఓట్లన్నింటినీ తొలగించి.. తిరిగి వారిని మరోసారి రప్పించి వారి చేత మరోమారు ఓటు వేయించారు. 

తాను బీజేపీకి ఓటు వేద్దామనుకుంటే ఓ అధికారి కాంగ్రెస్‌కు వేయించాడని ఆరోపించింది ఓ వృద్ధురాలు. అమేథికి చెందిన ఓ వృద్ధురాలు ఉదయం పోలింగ్ బూత్‌కి వచ్చింది. తాను బీజేపీకి ఓటు వేయాలని అనుకున్నానని.. అయితే ఓ అధికారి తన చేయి పట్టుకుని బలవంతంగా కాంగ్రెస్ బటన్ నొక్కించారని పేర్కొంది. 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విరుచుకుపడ్డారు. రాహుల్ ప్రొత్సాహంతోనే అమేథిలో కాంగ్రెస్ శ్రేణులు చెగరేగుతున్నాయని ఆమె ఆరోపించారు.

బూత్‌ల అక్రమణపై తాను ఈసీతో పాటు యూపీ అధికారులకు సమాచారం అందించానన్నారు. రాహుల్ దుశ్చర్యలను గమనించి అమేథి ఓటర్లు ఆయనను శిక్షించాలని స్మృతి ప్రజలకు పిలుపునిచ్చారు. 

రాయబరేలిలో బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. హరిచంద్‌పూర్‌లోని పోలింగ్ బూత్ నెం. 348, 349, 350లలో బీజేపీకి చెందిన గ్రామ సర్పంచ్ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ప్రముఖ సినీనటుడు అశుతోష్ రాణా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌ నర్సింగాపూర్ లోక్‌సభ పరిధిలోని గదర్‌ద్వారాలో ఏర్పాటు చేసిన 105వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

పశ్చిమ బెంగాల్‌లోని బరక్‌పూర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి అర్జున్ సింగ్ భద్రతా దళాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో భద్రతా దళాలు తాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. 

11 గంటల వరకు పోలింగ్ శాతం:

బిహార్- 20.74%
జమ్మూకాశ్మీర్- 6.09%
మధ్యప్రదేశ్- 27.57%
రాజస్థాన్- 29.35%
ఉత్తరప్రదేశ్- 22.51%
బెంగాల్- 33.63%
జార్ఖండ్- 29.49% 

ఈ ఎన్నికల్లో సైతం తానే గెలవబోతున్నట్లు చెప్పారు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. లక్నోలో సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. బీజేపీ ఈసారి మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌ పరిధిలోని నష్కర్‌పూర్‌ పోలింగ్ బూత్ నెంబర్ 110లో ప్రెసైడింగ్ ఆఫీసర్‌ను ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. తృణమూల్ నేత మహారాజ నాగ్ ఓ ఓటరును ఈవీఎం వరకు తీసుకెళ్లడంపై విమర్శలు రావడంతో ఈసీ చర్యలు చేపట్టింది. 

మధ్యప్రదేశ్‌లోని ఛత్రపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించి పుట్టెడు దు:ఖంలో ఉండి కూడా ఓటు వేయడానికి వచ్చి.. పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చాడు. 

ఉదయం 10 గంటల వరకు పోలింగ్ శాతం

బిహార్- 11.51%
జమ్మూకాశ్మీర్- 1.36%
మధ్యప్రదేశ్- 13.18%
రాజస్థాన్- 14.00%
ఉత్తరప్రదేశ్- 9.85%
బెంగాల్- 16.56%
జార్ఖండ్- 13.46%    

బీహార్‌లో ఉదయం 10 గంటల వరకు పోలింగ్ శాతం

సీతామర్హీ- 15.00%
మధుబనీ- 13.00%
ముజఫర్‌పూర్- 14.10%
శరన్- 17.00 %
హాజీపూర్- 16.00%    

బీహార్‌లో ఉద్రిక్తతం: ఈవీఎం ధ్వంసం

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీహార్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛప్రా 131వ పోలింగ్ బూత్‌లో రంజిత్ పాశ్వాన్ అనే వ్యక్తి ఈవీఎం మెషిన్‌ను ధ్వంసం చేశాడు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ప్రియాంకు ఐదేళ్ల క్రితం నా పేరు తెలుసా: స్మృతీ ఇరానీ

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఐదేళ్ల క్రితం నా పేరు తెలియదని.. కానీ కొద్దిరోజులుగా ఆమె తన పేరును జపిస్తోందన్నారు. భర్త రాబర్ట్ వాద్రా కంటే తన పేరే ఎక్కువ వాడుతోందంటూ ఆమె ఎద్దేవా చేశారు.

రాహుల్, ప్రియాంకాలు రాజకీయాలను సొంత లాభం కోసం వాడుతున్నారని, మనుషుల ప్రాణాలంటే కూడా వారికి లెక్కలేదన్నారు. ఈ సందర్భంగా అమేధీలో రాహుల్ గాంధీ ట్రస్టీగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించనందున ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడని స్మృతీ గుర్తు చేశారు. 

జార్ఖండ్‌లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం

కొడార్మ-11.94%
రాంచీ- 15.69%
కుంతి- 12.85%
హాజారీబాగ్- 8.10%

పోలింగ్ బూత్‌లో ఓటర్లకు వినూత్న స్వాగతం:

తృణమూల్ కాంగ్రెస్ బోస్‌గావ్ అభ్యర్ధి మమతా బాలా.. బీజేపీ అభ్యర్ధి శాంతన్ ఠాకూర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. బీజేపీ తలపాగా ధరించి ఆయన ఓటు హక్కును వినియోగించడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లేనని అన్నారు. 

ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

బిహార్- 11.51%
జమ్మూకాశ్మీర్- 0.80%
మధ్యప్రదేశ్- 11.82%
రాజస్థాన్- 13.38%
ఉత్తరప్రదేశ్- 9.82%
బెంగాల్- 14.49%
జార్ఖండ్- 13.46%

కేంద్ర మంత్రి జయంత్ సిన్హా ఓటు హక్కును వినియోగించుకున్నారు. హాజరీబాగ్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

ఓటేసిన 105 ఏళ్ల బామ్మ:

జార్ఖండ్‌లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో హాజరిబాగ్‌లో ఏర్పాటు చేసిన 450వ నెంబర్ పోలింగ్ బూత్‌లో 105 ఏళ్ల బామ్మ ఓటు వేశారు. ఆమె కుమారుడు భుజాలపై మోసుకుని తల్లిని పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చారు.     

యువతకు మోడీ పిలుపు:

దో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. దేశ భవిష్యత్‌ను నిర్దేశించేందుకు, ప్రజాస్వామ్య పరిపుష్టికి ఓటు సరైన ఆయుధమని ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటి చేస్తున్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్‌‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పుల్వామాలో పోలింగ్ సందర్భంగా హింస చెలరేగింది. ఓ పోలింగ్ బూత్‌పైకి దుండగులు గ్రేనేడ్ దాడి చేశారు. 

ఐదో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బారక్‌పూర్ బీజేపీ అభ్యర్ధి అర్జున్ సింగ్‌పై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డినట్లుగా సమాచారం. పోలింగ్ కేంద్రం వద్ద అర్జున్ సింగ్‌ను బయటకు లాక్కొచ్చి దాడి చేశారని, ఈ ఘటనతో ఓటర్లు భయాందోళనకు గురైయ్యారని ఆయన తెలిపారు. 

తీవ్రవాదులకు కేంద్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 

పశ్చిమబెంగాల్లోని పలు ప్రాంతాల్లో వీవీప్యాట్స్, ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇప్పటి వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. 

బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని మాంటిస్సోరి ఇంటర్మీడియట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. 

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని స్కాలర్స్ హోమ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన 333వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైపూర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో భార్య గాయత్రి రాధోడ్‌తో పాటు ఆయన ఓటు వేశారు. 

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య నీలిమా సిన్హాతో కలిసి ఉదయాన్నే పోలింగ్ బూత్‌కు చేరుకున్న ఆయన క్యూలైన్‌లో నిల్చోని ఓటు వేశారు.  

ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తో సహా 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు

మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ నియోజకవర్గానికి సోమవారంతో పోలింగ్ ముగియనుంది. ఐదో విడతలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ,  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios