Asianet News TeluguAsianet News Telugu

25యేళ్లు సహజీవనం చేసి.. ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మన్న మహిళపై యాసిడ్ దాడి, మృతి...

సహజీవనం చేస్తున్నఓ 54యేళ్ల మహిళ మీద ఆమె 62యేళ్ల భాగస్వామి యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో పదిహేను రోజుల తరువాత చికిత్స తీసుకుంటూ ఆ మహిళ గురువారం మృతి చెందింది. 

54 Years Mumbai Woman Attacked Acid By Live In Partner Of 25 Years, Dies - bsb
Author
First Published Feb 2, 2023, 1:26 PM IST

ముంబై : ముంబైలోని గిర్‌గావ్‌లో 54 ఏళ్ల మహిళ మీద యాసిడ్ దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ రెండు వారాల తరువాత కాలిన గాయాలతో మరణించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆసుపత్రికి తరలించే సమయానికి మహిళకు 50 శాతం కాలిన గాయాలు ఉన్నాయి. ఆమె మీద దాడి చేసింది ఆమెతో సహజీవనంలో ఉన్న మహేష్ పూజారి (62) అనే వ్యక్తి. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. పదిహేను రోజుల క్రితం, జనవరిలో, మహేష్ పూజారికి, బాధితురాలికి మధ్య వివాదం తలెత్తింది. ఇది తీవ్ర స్థాయికి చేరడంతో అతను తన భాగస్వామిపై యాసిడ్ దాడి చేశాడు. దీని మీద పోలీసులు మాట్లాడుతూ.. 

విషాదం : కారులో మంటలు చెలరేగి, గర్భిణి సహా ఇద్దరు వ్యక్తులు సజీవదహనం..

"ఇద్దరూ గత 25 సంవత్సరాలుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో, ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ మహిళ కొద్దిరోజులకుగా మహేష్ ను తనింట్లోనుంచి వెళ్లిపొమ్మని ఒత్తిడి తెస్తోంది. దీంతో అతను ఇంటి బయట ఉండాల్సి వచ్చింది" ముంబై దీంతో మహేశ్‌ మహిళపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

"గత నెలలో ఎల్‌టిమార్గ్ పోలీస్ స్టేషన్ పోలీసులు మహేష్‌ను అరెస్టు చేశారు. మహిళ మరణించడంతో ఈ రోజు హత్యా నేరం, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302, ఈ కేసుకు జోడించాం" అని పోలీసులు గురువారం తెలిపారు.

ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మైనర్ బాలికపై యాసిడ్ దాడి ఘటనలో బాధితురాలు మంగళవారం మృతి చెందింది. యాసిడ్ దాడికి గురైన ఓ బాలిక మృత్యువుతో పోరాడుతూ ఐదు నెలల తర్వాత మృతి చెందింది. అత్యాచారానికి నిరాకరించడంతో ఆమె నోట్లో యాసిడ్ పోసి దాడికి దిగిన ఘటన నిరుడు సెప్టెంబర్ లో శ్రీపొట్టి  శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ దాడి 14 ఏళ్ల బాలికపై ఆమెకు మేనమామ వరుసయ్యే వ్యక్తి చేశాడు. దీంతో ఆ చిన్నారి విలవిల్లాడిపోయింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కి మొదట ఓ కుమారుడు పుట్టాడు. అతను 18 ఏళ్ల వయసులో చనిపోయాడు.

ఆ తర్వాత పిల్లల కోసం వారు చాలా ప్రయత్నాలు చేయగా చాలా కాలానికి కూతురు పుట్టింది..లేక లేక కలిగిన సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. నిరుడు సెప్టెంబర్ 5వ తేదీన కుటుంబ సభ్యులందరూ ఏదో పనిమీద నెల్లూరుకు వెళ్లారు. 14 ఏళ్ల ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. మేనమామ వరసయ్యే ఓ వ్యక్తి ఇది గమనించాడు. ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అనుకోని ఈ ఘటనకు షాక్ అయిన బాధితురాలు అతని నుంచి తప్పించుకొని, బయటికి పారిపోయింది.

బాత్రూంలో దాక్కుంది. అయినా ఆమెను వెంటాడి, వేధించిన కామాంధుడు.. బాత్రూం తలుపులు పగలగొట్టి.. ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేయబోయాడు. బాధితురాలు కేకలు వేస్తుండడంతో.. ఆమెను ఆపడం కోసం అక్కడే ఉన్న ఆసిడ్ బాటిల్ తీసుకొని ఆమె నోట్లో పోసాడు. దీంతో ఆ బాలిక విలువిల్లాడిపోయింది. ఇది గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు బాలికను గమనించి.. వెంటనే మొదట నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం.. చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఐదు నెలలుగా చికిత్స పొందుతుంది. డాక్టర్లు రెండు రోజుల క్రితం బాలికను  పరీక్షించి.. రెండు నెలల తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని.. దీంతో ముఖం పాత స్థితికి వస్తుందని చెప్పారు.  దీంతో బాలిక బతుకుతుంది అని తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఇంతలోనే రెండు రోజుల్లో వారి కలలు ఆవిరయ్యాయి. ఐదు నెలలుగా మృత్యువుతో పోరాడి  మంగళవారం బాధితురాలు మృతి చెందింది.  దీనిమీద నెల్లూరు దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పంచనామ కోసం బుధవారం చెన్నైకి పోలీసులు వెళ్లనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios