Asianet News TeluguAsianet News Telugu

టెక్నాలజీ సాయంతో లాక్ ఓపెన్: ఒకటి కాదు రెండు కాదు, 500 కార్ల చోరీ

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 కార్లు దొంగతనం చేసి వాటి ఇంజిన్లు, ఛాసిస్ నెంబర్లను మార్చేసి విక్రయించిన ఘరానా ముఠాకు చెందిన లీడర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పెద్ద ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నారు

500 vehicle theft gang leader arrested in delhi ksp
Author
New Delhi, First Published Jul 2, 2021, 2:14 PM IST

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 కార్లు దొంగతనం చేసి వాటి ఇంజిన్లు, ఛాసిస్ నెంబర్లను మార్చేసి విక్రయించిన ఘరానా ముఠాకు చెందిన లీడర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పెద్ద ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గడిచిన ఏడేళ్లుగా ఈ ముఠా సభ్యులు వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠా లీడర్‌ను పట్టుకున్నారు. ఈ ముఠాలోని మిగిలిన నలుగురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read:సినీ నిర్మాత కారు చోరీ, 56 కార్లు చోరీ : దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకు సవాల్

ఐదుగురు సభ్యులను హారున్, గుర్ఫామ్, అమిత్, సాజిద్, యూసఫ్‌లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో హారున్ ముఠా లీడర్‌ అని, ప్రస్తుతం అతడు తమ కస్టడీలోనే ఉన్నాడని తెలిపారు. సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి బయట పార్కింగ్ చేసి ఉన్న కారులను దొంగిలిస్తారు. జూన్‌లో ఒక్క ఢిల్లీలోనే 18 కార్లను ఈ ముఠా దొంగిలించింది. అలా గడిచిన ఏడేళ్లలో సుమారు 500 కార్లను చోరీ చేశారు. దొంగిలించిన కార్ల ఇంజన్లు, చాసిస్‌ నంబర్లను మార్చేసి ఢిల్లీ, పంజాబ్, బిహార్, జార్ఖండ్, నేపాల్, జమ్మూ కశ్మీర్‌లో ఈ ముఠా సభ్యులు విక్రయిస్తారు. అంతే కాకుండా ఈ గ్యాంగ్ కార్ల మాడిఫికేషన్‌లో కూడా పాల్గొంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios