ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో చాలా మంది యువతులు, మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. గతేడాది జరిగిన హథ్రాస్ ఘటనను ఇంకా ఎవరూ మరచిపోలేదు. అంతలోనే అలాంటి మరో దారుణం వెలుగు చూసింది.

యూపీలోని బడౌన్ జిల్లా ఉఘాటి ప్రాంతంలో 50 ఏళ్ల అంగన్ వాడీ కార్యకర్తపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, హతమార్చారు. అంగన్ వాడీ కార్యకర్త మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

ముగ్గురు వ్యక్తులు మహిళపై సామూహిక అత్యాచారం జరిపి, హత్య చేశారని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము ఐపీసీ సెక్షన్ 376, 302 ల కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని బడౌన్ ఎస్పీ సంకల్పు శర్మ చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ వివరించారు.