చాక్లెట్లు ఆశచూపి... ఐదేళ్ల చిన్నారిపై కామాంధుడి అత్యాచారం

5-yr-old lured with sweets, raped by 19-yr-old neighbour in Maharashtra
Highlights

అభం శుభం తెలియని ఓ చిన్నారికి చాక్లెట్ల ఆశచూపి ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు పొలం పనులపై బైటికెళ్లగా చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని ఐదేళ్ల చిన్నారిని 19ఏళ్ల యువకుడు అత్యంత క్రూరంగా అనుభవించాడు.
 
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని బెల్గార్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేకుంది. గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన దంపతులకు నివాసముంటున్నారు. ఈ దంపతులకు ఐదు సంవత్సరాల వయసున్న కూతురు, ఏడు నెలల వయసున్న కొడుకు ఉన్నారు.  అయితే వర్షాకాలం కావడంతో పొలం పనుల్లో బిజీగా ఉన్న దంపతులు కూతురిని, కొడుకును ఇంట్లోనే వదిలి ఆదివారం పొలానికి వెళ్లారు.

తల్లిదండ్రులు వీరిద్దరి ఇంట్లోనే వదిలి వెళ్లడాన్ని పక్కింట్లో ఉన్న ఓ 19ఏళ్ల యువకుడు గమనించాడు. దీంతో బాలికను ఎలాగైనా అనుభవించాలని భావించిన అతడు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. 

అయితే బాలిక జరిగిన విషయాన్ని పొలం నుండి ఇంటికి రాగానే తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక వాడ పోలీసులకు ఈ అఘాయిత్యంపై ఫిర్యాదు చేశారు.  పోలీసుల నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 
loader