Asianet News TeluguAsianet News Telugu

నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు.. Mamata Banerjee ఒక్కరే తప్పు అని చెప్పారు.. టీఎంసీ ఎంపీ

నేటితో పెద్ద నోట్ల రద్దు (demonetisation) జరిగి ఐదేళ్లు పూర్తైన సందర్బంగా పలువురు విపక్ష నేతలు మోదీ ఆనాడు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా అని ప్రశ్నిస్తున్నారు. అనాలోచిత చర్యతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడుతున్నారు. 

5 years of Demonetisation Derek O'Brien says Only Mamata Banerjee Got It Spot On
Author
Calcutta, First Published Nov 8, 2021, 3:22 PM IST

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు (demonetisation) నేటికి ఐదేళ్లు పూర్తయింది. దేశంలో నల్లధనాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేసినట్టుగా మోదీ సర్కార్ తెలిపింది. 2016 నవంబర్‌ 8న  రాత్రి 8 గంటకు జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోదీ ప్రకటనతో అప్పటివరకు చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ చిత్తు కాగితాలు మారిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా కొన్ని వారాల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోదీ తీసుకన్న ఈ ఈ నిర్ణయాన్ని పలువురు నేతలు వ్యతిరేకించారు. ముఖ్యమంగా ప్రతిపక్షాలు మోదీ నిర్ణయం విఫలమైందని.. దాని వల్ల నష్టం జరిగిందని ఆరోపించాయి. 

నేటితో పెద్ద నోట్ల రద్దు (demonetisation) జరిగి ఐదేళ్లు పూర్తైన సందర్బంగా పలువురు విపక్ష నేతలు మోదీ ఆనాడు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా అని ప్రశ్నిస్తున్నారు. అనాలోచిత చర్యతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓ బ్రియన్ (Derek O'Brien).. నోట్ల రద్దును తమ పార్టీ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు కొన్నిగంటల్లోనే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వరుసగా ఐదు ట్వీట్స్‌ చేశారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ ఒక్కరే అప్పుడు నిజం మాట్లాడరని పేర్కొన్నారు. మోదీ నిర్ణయం తప్పని విమర్శించారని అన్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను డెరెక్ ఓ బ్రియన్ ట్వీట్ చేశారు.

అప్పుడు మమతా తన ట్వీట్‌లో ఈ క్రూరమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినట్టుగా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేకపోయినందును.. తన వైఫల్యాన్ని మళ్లించడానికి ఈ డ్రామా ఆడుతున్నాని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఇంకో ట్వీట్‌లో.. నోట్ల రద్దును ఆర్థిక గందరగోళంగా అభిప్రాయపడిన మమతా బెనర్జీ.. భారతదేశంలోని సామాన్య ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నారని అన్నారు. 

 

అంతేకాకుండా దేశంలోని దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజల పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారం మొత్తం కష్టపడితే వారికి ఒక 500 రూపాయల నోట్ వస్తుందని.. రేపటి నుంచి వారు నిత్యావసరాలు ఎలా కొంటారని ప్రశ్నించారు. తాను నల్ల ధనాన్ని, అవినీతిని వ్యతిరేకిస్తానని.. అదే సమయంలో సామాన్య ప్రజల గురించి ఆందోళన చెందుతున్నట్టుగా చెప్పారు. 

మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా పెద్ద నోట్ల రద్దుపై విమర్శలు గుప్పించారు. పెద్ద నోట్ల రద్దు ఉద్దేశం ఎందుకు నెరవేరలేదని ఆమె ప్రశ్నించారు. #DemonetisationDisaster అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ఆమె పోస్ట్ చేశారు. నోట్ల రద్దు విజయవంతమైతే.. అవినీతి ఎందుకు అంతం కాలేదు?, నల్లధనం ఎందుకు వెనక్కి రాలేదు?, ఆర్థిక వ్యవస్థ నగదు రహితంగా ఎందుకు మారలేదు?, ఉగ్రవాదాన్ని ఎందుకు దెబ్బతీయలేదు?, ద్రవ్యోల్బణం ఎందుకు నియంత్రించబడదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios