లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్: ట్యూటర్ ఇంటిని పోలీసులకు చూపిన బాలుడు

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న ఓ ట్యూటర్ భాగోతాన్ని ఐదేళ్ల బాలుడు బట్టబయలు చేశాడు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడిలో వైరల్ గా మారింది.

5-year-old boy blurts out details of tutor taking classes during lockdown in Punjab

చంఢీఘడ్:లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న ఓ ట్యూటర్ భాగోతాన్ని ఐదేళ్ల బాలుడు బట్టబయలు చేశాడు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడిలో వైరల్ గా మారింది.

పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా బటాలాలోని తాతరి మొహల్లా ప్రాంతంలో ఓ వ్యక్తి  ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు. అయితే అతను పొంతనలేని సమాధానం చెప్పాడు.

చిన్నారులను ట్యూషన్ క్లాసులకు తీసుకెళ్తున్నారని  పోలీసులకు తెలిసింది. ట్యూటర్ ఇంటి అడ్రస్ ను మాత్రం పోలీసులు తెలుసుకోలేదు. దీంతో చిన్నారిని తీసుకొని పోలీసులు ట్యూటర్ ఇంటిని కనిపెట్టారు.  లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా ట్యూషన్ నిర్వహించడంపై పోలీసులు ట్యూటర్ పై మండిపడ్డారు.

also read:సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్: లాక్‌డౌన్ పైనే చర్చ

మళ్లీ ఇలాంటి తప్పులు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇక అడ్రస్ చెప్పకుండా ఇబ్బంది పెట్టిన చిన్నారుల మామయ్యను పోలీసులు మందలించారు.లాక్ డౌన్ నేపథ్యంలో పిల్లల్ని బయటకు తీసుకువెళ్లకూడదని పోలీసులు హెచ్చరించారు.ఈ దృశ్యాలు రికార్డు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్  గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios