Asianet News TeluguAsianet News Telugu

యూపీపీఎస్సీ ఫ‌లితాల్లో మాజీ సైనికులకు 5 శాతం కోటా ఇవ్వాల్సిందే - అల‌హాబాద్ హైకోర్టు

గ్రూప్-సీ, గ్రూప్-డీ ఫలితాల్లో మాజీ సైనికులకు 5 శాతం కోట కల్పించి మళ్లీ ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. తాజా ఫలితాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 

5 percent quota should be given to ex-servicemen in UPPSC results - Allahabad High Court
Author
Lucknow, First Published Aug 4, 2022, 11:58 AM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ ప్రిలిమిన‌రీ ఎక్సామ్ -2021 ఫలితాలను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టుల‌లో మాజీ సైనికుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చిన త‌రువాత ఫలితాలను మళ్లీ విడుదల చేయాలని యూపీపీఎస్సీని ఆదేశించింది. ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందిన నలుగురు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తి సంగీత చంద్ర అనుమతించారు. మాజీ సైనికులకు రిజర్వేషన్ బెనిఫిట్ ఇవ్వకుండా ప్రకటించిన పరీక్ష ఫలితాలను రద్దు చేసినట్లు తెలిపారు.

Monkeypox: దేశంలో 9కి చేరిన మంకీపాక్స్ కేసులు.. కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం..!

నెల రోజుల్లోగా ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించి, మెయిన్ పరీక్షకు అడ్మిట్ కార్డులు జారీ చేయాలని, మాజీ సైనికులకు రిజర్వేషన్ల ప్రయోజనం కల్పిస్తూ ఫలితాలను ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. కంబైన్డ్ స్టేట్ అప్పర్ సబార్డినేట్ సర్వీసెస్ (PCS) ఎగ్జామినేషన్-2021, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్/రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం కొనసాగుతున్న ఎంపిక ప్రక్రియలో మాజీ సైనికులకు 5 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేలా UPPSCకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు.

కన్నకూతురిపై కన్నేసిన తండ్రి.. మగబిడ్డ పుట్టడంతో విషయం వెలుగులోకి...

ప్ర‌స్తుతం ఈ పోస్టుల‌కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కమిషన్ జూలై 21 నుంచి ఇంటర్వ్యూలను కూడా ప్రారంభించింది. వీటిని ఆగస్టు 5 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన యూపీపీఎస్సీ - 2021 కు సంబంధించిన నోటిఫికేష‌న్ ను జారీ చేసింది. ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మార్చి 5ను చివ‌రి తేదీగా గుర్తించింది. త‌రువాత దానిని మార్చి 17వ తేదీ వ‌ర‌కు పొడ‌గించింది. కాగా.. ఈ నోటిఫికేష‌న్ లో మాజీ సైనికులకు ఐదు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన సవరణలు మార్చి 3, 2021న రాష్ట్ర ప్ర‌భుత్వం గెజిట్ లో తెలియ‌జేసింది. 

హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ యువతి... ఆత్మహత్యకాదు.. హత్యాచారం అంటున్న తండ్రి..

అయితే దరఖాస్తుకు చివరి తేదీ నాటికి ముందే నోటిఫికేషన్‌ను ప్రచురించినప్పటికీ, మాజీ సైనికులకు రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ఇవ్వడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరాకరించిందని పిటిషనర్ సతీష్ చంద్ర శుక్లాతో పాటు మరో ముగ్గురు వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది. “ ఒక నెలలోపు ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ప్రచురించాలి. దాని త‌రువాత మెయిన్ రాత పరీక్షకు అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. మాజీ సైనిక సిబ్బందికి 5 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తూనే  గ్రూప్-బీ, గ్రూప్ -సీ ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.’’ అని తెలిపింది. 

స్కూటర్ పై స్మృతి ఇరానీ, భలే ఫిట్ గా ఉన్నావన్న ఏక్తాకపూర్.. వైరల్ అవుతున్న వీడియో..

కాగా.. 2021 అక్టోబ‌ర్ 24వ తేదీన ఈ పరీక్షను ఉత్త‌రప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 1,505 కేంద్రాల్లో నిర్వహించబడింది. డిసెంబర్ 1వ తేదీన ప్రీ ఎగ్జామ్- 2021 ఫలితాలను ప్రకటించింది. ఇందులో 7,688 మంది అభ్యర్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ప్రీ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు క‌మిష‌న్ లక్నో, ప్రయాగ్‌రాజ్, ఘజియాబాద్‌లలో ప‌ట్ట‌ణాల్లో మెయిన్స్ ఎక్సామ్ నిర్వ‌హించింది. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను జూలై 12వ తేదీన ప్ర‌క‌టించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios