road accident: దేశంలోని ర‌హ‌దారులు ర‌క్త‌మోడుతున్నాయి. ఆదివారం ప‌లు ప్రాంతాల్లో రోడ్డు ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. గుజ‌రాత్ లోని ధోల్కా ప‌ట్ట‌ణంలోనూ ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న లో ఐదుగురు అక్క‌డికక్క‌డి చ‌నిపోయారు. 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  

road accident: దేశంలోని ర‌హ‌దారులు ర‌క్త‌మోడుతున్నాయి. నిత్యం చోటుచేసుకుంటున్న ఈ రోడ్డు ప్ర‌మాదాల కార‌ణంగా వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం కూడా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో రోడ్డు ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. road accidents లో డ‌జ‌న్ల సంఖ్య‌లో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గాయ‌ప‌డిన వారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. గుజ‌రాత్ లోనూ శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా 10 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం వారిలో ప‌లువురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ప్రాణాలు నిలుపుకోవ‌డం కోసం పోరాడుతున్నారు. 

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. గుజ‌రాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా పట్టణం సమీపంలో గుర్తుతెలియని వాహనాన్ని మినీవ్యాన్ ఢీ కొట్టింది ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్ల‌డించారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. వారు ప్రాణాలు నిలుపుకోవ‌డానికి పోరాడుతున్నారు. శనివారం అర్థరాత్రి వ్యాన్ లో ప్రయాణికులు వడోదర నుంచి బొటాడ్ జిల్లాలోని ఒక దేవాలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళుతుండగా రాష్ట్ర రహదారిపై ఈ road accident జరిగిందని ధోల్కా టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

"ప్ర‌యాణికుల‌తో వేగంగా వెళుతున్న మినీవ్యాన్ వెనుక నుండి ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఐదుగురు వ్యాన్‌లో ఉన్నవారు అక్కడికక్కడే మరణించారు. మరో పది మంది వ్యాన్ ప్రయాణికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించాము. వారికి చికిత్స అందుతున్న‌ది. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది" అని ధోల్కా పోలీస్ స్టేష‌న్ అధికారి తెలిపారు. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారిలో ముగ్గురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నారని, వ్యాన్ ఢీకొన్న వాహనాన్ని పోలీసులు ఇంకా గుర్తించలేదని అధికారి తెలిపారు. ఈ road accident చ‌నిపోయిన వారితో పాటు గాయ‌ప‌డిన బాధితులు 27 నుంచి 48 సంవ‌త్స‌రాల మ‌ధ్య వయస్కులేనని పోలీసులు తెలిపారు.

ఇలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో కూడా యువతీయువకులు రాత్రిళ్లు అతివేగంతో దూసుకెళ్తుండ‌టంతో ప్ర‌మాదాలు పెరిగిపోతున్నాయి. మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డుపుతూ జ‌రుగుతున్న ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయి. ఇదే త‌ర‌హాలో హైదరాబాద్ కు చెందిన కొందరు యువకుడు శనివారం ఫుల్లుగా మద్యం సేవించారు. ఇదే మత్తులో యువకులు అర్ధరాత్రి కారులో షికారులకు బయలుదేరారు. తాగిన మత్తులో కారును నడపలేని స్థితిలో వుండికూడా మితిమీరిన వేగంతో నడపసాగారు. దీంతో అదే వేగంతో దూసుకెళుతూ అదుపుతప్పిన కారు ఎల్బీనగర్ లో ప్రమాదానికి గురయ్యింది. పోలీసుల ముందే ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవడంతో పోలీసులు వెంట‌నే ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి ప్రాణాలు పోకుండా కాపాడారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో (Kukatpally) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీ వద్ద బైక్‌ను టిప్పర్ (tipper hits bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న జగన్ మోహన్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు.