Asianet News TeluguAsianet News Telugu

అక్కడ రైల్వే ఫ్లాట్ ఫాం ధర రూ.50..!


కరోనా మహమ్మారి నేపథ్యంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జనం అధిక రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

5 Fold Increase In Platform Ticket Price In Mumbai Amid Covid Surge
Author
Hyderabad, First Published Mar 3, 2021, 7:56 AM IST

మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో జనం రద్దీ నియంత్రించే పేరుతో  సెంట్రల్ రైల్వే అధికారలు ఫ్లాట్ ఫాం టికెట్ ధరలను భారీగా పెంచారు. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ లోని కొన్ని ముఖ్యమైన రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 నుంచి ఏకంగా రూ.50లు చేసినట్లు ప్రకటించారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జనం అధిక రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్, లోక్ మాన్య తిలక్ టెర్మినన్ తో పాటు పొరుగున ఉన్న ఠానే, కళ్యాణ్, పాన్ వెల్, భీవాండీ రోడ్ స్టేషన్లలో పెంచిన ఈ ధరలు అమలు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ వెల్లడించారు.

పెంచిన ఫ్లాట్ ఫాం ధరలు మార్చి 1 నుంచి జూన్ 15 వరకు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వేసవి ప్రయాణాల సందర్భంగా ఆయా స్టేషన్ల వద్ద అధిక రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, ఫిబ్రవరి రెండో వారం నుంచి మహారాష్ట్ర లో రోజువారీ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముంబయి మహానరగంలో ఇప్పటిదాకా 3.25లక్షల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios