బెంగుళూరు: ప్రేమ పేరుతో  19 ఏళ్ల యువకుడిని 45 ఏళ్ల వివాహిత కిడ్నాప్ చేసినట్టుగా యువకుడి తల్లి ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరులో చోటు చేసుకొంది. 

Also read:మండపేటలో స్నేహితుడిని చితకబాది డిగ్రీ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరులో నిర్మల అనే మహిళ ఆటో డ్రైవర్‌గా పనిచేసేది. ఆమెకు 19 ఏళ్ల వయస్సున్న కొడుకు ఉన్నాడు. మహబళేశ్వర సర్కిల్ వద్ద ఉడిపి హోటల్‌లో పనిచేసేవాడు. అదే హోటల్‌లో చంద్రిక అనే వివాహిత పనిచేసేది. ఆమె వయస్సు 45 ఏళ్లు. ఆమెకు భర్త పిల్లలు ఉన్నారు. 

ఇద్దరూ ఒకే చోట పనిచేయడంతో తన కొడుక్కి మాయమాటలు చెప్పి వారం రోజుల క్రితం తన కొడుకును  తీసుకెళ్లిందని   నరేష్ తల్లి ఆరోపిస్తోంది. తన  కొడుకును  తిరిగి తన వద్దకు తీసుకురావాలని ఆమె కన్నీళ్లు పెట్టుకొంటుంది.  ఈ మేరకు యువకుడి తల్లి   పోలీసులకు ఫిర్యాదు చేసింది.