కాకినాడ:తూర్పు గోదావరి జిల్లాలో డిగ్రీ విద్యార్ధినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విద్యార్ధిని స్నేహితుడిపై దాడి చేసి దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని ఓ డిగ్రీ కాలేజీలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 2వ తేదీన కాలేజీకి చివరి రోజు. దీంతో కాలేజీలో  వీడ్కోలు వేడుకలను ఏర్పాటు చేసుకొన్నారు. ఈ వీడ్కోలు సమావేశం ముగిసిన తర్వాత యువతి తన స్నేహితుడితో కలిసి బైపాస్ రోడ్డు సమీపంలోని పశువుల కొట్టం వద్ద మాట్లాడుతోంది.ఈ విషయాన్ని పశువుల కొట్టం యజమాని యువతిపై కన్నేశాడు.

వెంటనే తన ఇద్దరు స్నేహితులను అక్కడికి పిలిపించాడు. వీరిద్దరూ కూడ మరో యువకుడితో కలిసి మోటార్ సైకిల్ పై వచ్చారు. నలుగురు యువతి స్నేహితుడిపై దాడి చేశారు. సెల్‌ఫోన్ లాక్కొన్నారు. అనంతరం ఆ యువకుడిని బైక్ పై పాన్ షాపు వద్దకు తీసుకెళ్లి ఫోన్ రీచార్జీ చేయించుకొని వెళ్లాడు.బాధిత యువకుడిని అక్కడే వదిలివెళ్లాడు.

బాధిత యువకుడు తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. స్నేహితులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొన్నాడు. అప్పటికే ఆ యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. యువతిని వదిలేసి వెళ్లిపోయారు. 

డిగ్రీ విద్యార్థులు ఆ యువతిని ఇంటివద్ద దింపారు. బాధిత కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పారు. పాన్ షాపు వద్ద మొబైల్ రీచార్జీ చేయించుకొన్న వ్యక్తి నెంబర్ ఆధారంగా అతడిని గుర్తించారు. అతడి వద్దకు వెళ్లి అతడిని చితకబాదారు.దీంతో అతను ముగ్గురి సమాచారం ఇచ్చారు. నిందితుల ఇంటి వద్దకు వెళ్ళి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.