యూపీలో 42 మంది కరోనా రోగుల మిస్సింగ్: అధికారుల గాలింపు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజీపూర్ లో 42 మంది కరోనా రోగులు అదృశ్యమయ్యారు. ఆచూకీ లేకుండా పోయిన వీరి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజీపూర్ లో 42 మంది కరోనా రోగులు అదృశ్యమయ్యారు. ఆచూకీ లేకుండా పోయిన వీరి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 3300 కరోనా సోకిన రోగులు కన్పించకుండా పోయిన విషయం మర్చిపోకముందే యూపీలో కూడ 42 మంది కరోనా రోగులు కన్పించకుండా పోయారు.
కన్పించకుండా పోయిన రోగులను పట్టుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఘజిపూర్ మెడికల్ అధికారి అడిషన్ జిల్లా మేజిస్ట్రేట్ కు లేఖ రాశారు. కన్పించకుండా పోయిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఘజిపూర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 1,138కి పెరిగింది. గురువారం నాడు 70 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 567 మంది రోగులు కరోనా నుండి కోలుకొన్నారు. ఇంకా 567 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 10 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసులు 80 వేలను దాటాయి. గురువారం నాడు ఒక్క రోజే 3705 కేసులు నమోదయ్యాయి.
గురువారం నాడు ఒక్క రోజే అత్యధికంగా 57 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1587 మంది కరోనాతో చనిపోయారు.