అక్రమ మద్యంపై దాడులు: 42 మంది పోలీసులు క్వారంటైన్‌కి

అక్రమ మధ్యం సమాచారంతో రైడింగ్ కు వెళ్లిన పోలీసులు కరోనా భయంతో క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
జార్ఖండ్ రాష్ట్రంలోని కోడెర్మా జిల్లాలో ఈ నెల 4వ తేదీన అక్రమ మద్యం సరఫరా జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

42 Jharkhand cops quarantined after raiding illegal liquor factory as accused tests Covid+

రాంచీ: అక్రమ మధ్యం సమాచారంతో రైడింగ్ కు వెళ్లిన పోలీసులు కరోనా భయంతో క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
జార్ఖండ్ రాష్ట్రంలోని కోడెర్మా జిల్లాలో ఈ నెల 4వ తేదీన అక్రమ మద్యం సరఫరా జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

 డీఎస్పీ ఆధ్వర్యంలో జయ్ నగర్, చాంద్ వారా పోలీస్ స్టేషన్లకు చెందిన 42 మంది పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి ఈ దాడుల్లో పాల్గొన్నారు. అక్రమ మద్యం సరఫరా విషయంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జైలుకు తరలించే సమయంలో నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది.

దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ కరోనా పాజిటివ్ వచ్చిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్రమ మద్యం తయారీ స్థావరంపై దాడికి వచ్చిన 42 మంది పోలీసులను ఒక నిందితుడిని దోమచాంచ్ క్వారంటైన్ సెంటర్ కి తరలించారు.

alsoread:కరోనాకు అధిక ఫీజులు:ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

క్వారంటైన్ తరలించిన పోలీసు సిబ్బంది ఆరోగ్యం నిలకడగానే ఉందని  పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కి తరలించినట్టుగా కోడెర్మా డిప్యూటీ కమిషనర్ రమేష్ గోలప్ తెలిపారు.

జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటికే 2,781 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో 19 మంది మరణించారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చే వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని  అధికారులు ప్రజలకు సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios