కరోనాకు అధిక ఫీజులు:ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
కరోనా సోకిన రోగుల నుండి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటె అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: కరోనా సోకిన రోగుల నుండి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటె అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటె ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని న్యాయవాది శ్రీకిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మంగళవారం నాడు విచారించింది.
also read:ఒక్క రోజుకే రూ.1.50 లక్షల బిల్లు: ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ నిర్భంధం,సెల్ఫీ వీడియో
కరోనా రోగులకు చికిత్స విషయంలో ఏ మేరకు వసూలు చేయాలనే దానిపై ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం మాత్రం ఇష్టారాజ్యంగా పీజులు వసూలు చేస్తున్నట్టుగా పిటిషనర్ ఆరోపించారు.
also read:ప్రైవేట్ ఆసుపత్రి నుండి నిమ్స్ కు డాక్టర్ సుల్తానా తరలింపు: చర్యలకు ఈటల ఆదేశం
ఈ విషయమై ఇవాళ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. పీవర్ ఆసుపత్రి డీఎంఓ సుల్తానాను నిర్భంధించిన ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకొన్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకొందని భావిస్తున్నట్టుగా కోర్టు అభిప్రాయపడింది.
ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ నెల 14వ తేదీలోపుగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు. యశోద, కేర్, సన్ షైన్ తదితర ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.