మధ్యప్రదేశ్‌లోని అగర్‌లో సోమవారం భాంగ్ (గంజాయి ఆకుల నుంచి సేకరించిన ద్రవం)తో తయారు చేసిన ప్రసాదాన్ని సేవించి దాదాపు 40 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని అగర్‌లో సోమవారం భాంగ్ (గంజాయి ఆకుల నుంచి సేకరించిన ద్రవం)తో తయారు చేసిన ప్రసాదాన్ని సేవించి దాదాపు 40 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి పరమేశ్వరుడి ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో 35 నుంచి 40 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది.
వెంటనే అప్రమత్తమమైన అధికారులు ఓ బృందాన్ని ఘటనాస్థలికి పంపారు. అస్వస్థతకు గురైన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. వీరందరినీ మెరుగైన వైద్య సహాయం కోసం నల్ఖెడ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులందరి పరిస్ధితి నిలకడగానే వుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
