నాలుగేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడి అత్యాచారం, పాప పరిస్థితి విషమం

4-year-girl raped by  school teacher  in Madhya Pradesh
Highlights

  • మధ్య ప్రదేశ్ లో దారుణం
  • నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
  • దారుణానికి పాల్పడిన స్కూల్ టీచర్ అరెస్ట్

దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక చోట లేకుంటే మరోచోట ఈ దాడుల పరంపర కొనసాగుతోంది. పాపం...అభం శుభం తెలియని, ఎదిరించలేని చిన్నారులే టార్గెట్ గా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ స్కూల్ టీచర్ అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే... మహేంద్ర గోండ్ అనే వ్యక్తి సత్నా జిల్లాలోని ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. ఇతడు తనకు పరిచమున్న ఓ వ్యక్తిని కలవడానికి అతడి ఇంటికి వెళ్లాడు. అయితే సదరు వ్యక్తి తన కూతురితో కలిసి ఇంటి ఆవరణలో పడుకున్నాడు. మహేంద్రతో కాస్సేపు మాట్లాడిన ఆ వ్యక్తి కాలకృత్యాల కోసం బైటికి వెళ్లాడు. దీన్నే అవకాశంగా భావించిన మహేంద్ర ఒంటరిగా ఉన్న చిన్నారిని అపహరించుకు వెళ్లాడు.

అతడు ఆ గ్రామ శివారులోకి చిన్నారిని తీసుకెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు.దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె చనిపోయిందని భావించి దుండగుడు అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

అయితే కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో పాప కోసం గాలించాడు. మహేంద్ర పై అనుమానంతో అతడిని పట్టుకొని గట్టిగా అడగ్గా అసలు విషయాన్ని చెప్పాడు. దీంతో అతడు తెలిపిన ఆచూకీ ప్రకారం చిన్నారి జాడ కనుక్కుని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను డిల్లీలోనిఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు మహేంద్ర గోండ్ పై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


 

 

loader