శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌ లోని సోఫియాన్  జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మిలిటెంట్లు మృతి చెందారు. 

సోఫియాన్ జిల్లాలోని దామోదర ఏరియాలో పోలీసులు కార్డన్ సెర్చ్‌ నిర్వహిస్తున్న సమయంలో నలుగురు మిలిటెంట్లు ఆర్మీ కంటపడ్డారు. ఆర్మీని చూసిన పోలీసులు మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఆర్మీ కూడ కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు అక్కడికక్కడే మృతి చెందారు.