Asianet News TeluguAsianet News Telugu

జైపూర్ బాంబు పేలుళ్లు: నలుగురు దోషులు, ఒకరికి విముక్తి

జైపూర్ బాంబు పేలుడు కేసులో నలుగురిని దోషులుగా తేల్చింది కోర్టు. మరోకరికి విముక్తి కల్పించింది. 

4 Found Guilty For 2008 Jaipur Serial Blasts That Killed 80, 1 Acquitted
Author
Jaipur, First Published Dec 18, 2019, 1:18 PM IST

జైపూర్: జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని  కోర్టు దోషులుగా తేల్చింది.ఈ కేసులో ఒకరిని నిర్ధోషిగా తేల్చింది కోర్టు.  

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో 2008లో  పలు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో  80 మంది మృతి చెందారు. మరో 170 మంది గాయపడ్డారు.

also read:బీహార్‌లో దారుణం: దళిత బాలికపై గ్యాంగ్‌రేప్‌కు యత్నం, కాల్పులు

మరో ముగ్గురు నిందితులు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఈ బాంబు పేలుళ్ల వెనుక టెర్రర్ గ్రూప్ ఇండియన్ ముజాహీద్దీన్ కో పౌండర్ యాసిన్ భత్కల్ ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులుగా కూడ ఉన్నాయని ఆ సమయంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.

రాజస్థాన్ కు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు కూడ దోషులకు బాంబులను సరఫరా చేశారని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన టెర్రరిస్ట్ వ్యతిరేక పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు కూడ 2008లో బాట్లా హౌజ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios