పాట్నా: బీహార్ రాష్ట్రంలో  దళిత బాలికపై గ్యాంగ్‌రేప్‌కు నలుగురు యువకులు ప్రయత్నించారు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది.దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు ఆ బాలికపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.    

బీహార్ రాష్ట్రంలోని రోహ‌తక్ జిల్లాలోని  రాయ్‌పూర్  పోలీస్‌స్టేషన్ పరిధిలో  ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ నెల 15వ తేదీన నలుగురు యువకులు బహిర్భూమికి వెళ్లిన బాలికపై  అత్యాచారానికి ప్రయత్నించారు.

ఆ సమయంలో బాలిక  తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో నిందితులు ఆ బాలికపై తుపాకీతో కాల్పులు జరిపారు.  కాల్పులు జరిపిన నిందితులు. ఈ కాల్పుల్లో  బాధితురాలు తీవ్రంగా గాయపడింది.

గాయపడిన బాధితురాలిని  జముహార్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితుల ఇళ్లపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 ఈ విషయం తెలిసిన వెంటనే రోహతక్ జిల్లా ఎస్పీ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.  నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

బాధితురాలికి అదే రోజున వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా పోలీసులు ప్రకటించారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడ కోర్టు సీఆర్‌పీసీ 164 సెక్షన్ ప్రకారంగా రికార్డు చేసింది.

గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు ప్రకటించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండాబందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.