Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో 'కోబ్రా' కలకలం

4 ఫీట్ల కోబ్రా (పాము)ను ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో  ఢిల్లీ రైల్వే కార్పోరేషన్ వర్కర్స్ పట్టుకొన్నారు. 

4-Feet-Long Cobra Rescued From Metro Station In Delhi
Author
New Delhi, First Published Aug 30, 2020, 2:30 PM IST

న్యూఢిల్లీ: 4 ఫీట్ల కోబ్రా (పాము)ను ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో  ఢిల్లీ రైల్వే కార్పోరేషన్ వర్కర్స్ పట్టుకొన్నారు. 

మెట్రో రైల్వే స్టేషన్  సిబ్బంది పాము ఉన్న విషయాన్ని గుర్తించి పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. ఢిల్లీ సాకేత్ మెట్రో డిపోలో ఈ ఘటన చోటు చేసుకొంది. వైల్డ్ లైఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వైల్డ్ లైఫ్ సిబ్బంది వెంటనే కోబ్రాను రక్షించారు.

దేశంలో ప్రాణాంతకమైన పాములలో కోబ్రా జాతి కూడ ఒకటని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కార్తీక్ సత్యనారాయణ్ చెప్పారు. కోబ్రాలు అత్యంత అరుదుగా కాటు వేస్తాయని ఆయన చెప్పారు. అయితే మనుషులకు భయపెట్టేందుకు  బుసలు కొడతాయన్నారు.

వచ్చే నెల 7వ  తేదీ నుండి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో మెట్రో రైల్వే స్టేషన్లను సంబంధిత అధికారులు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెట్రో రైల్వే స్టేషన్లో ఉన్న కోబ్రాను గుర్తించారు సిబ్బంది. దాదాపుగా ఐదు మాసాలుగా మెట్రో రైళ్లు నడవకపోవడంతో కోబ్రా ఇక్కడికి వచ్చి ఉండొచ్చని సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios