ముంబై జుహు బీచ్ లో ప్రమాదం, నలుగురు యువకులు మృతి

4 feared dead in Mumbai after they go for a swim at Juhu Beach
Highlights

ముంబై నగరంలోని జుహై బీచ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలో సరదాగా ఈతకు దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అయితే అందులో ముగ్గురి మృతదేహాలు లభించగా, మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

ముంబై నగరంలోని జుహై బీచ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. సముద్రంలో సరదాగా ఈతకు దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అయితే అందులో ముగ్గురి మృతదేహాలు లభించగా, మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అందేరీ ప్రాంతానికి చెందిన ఏడుగురు స్నేహితులు సాయంత్రం సమయంలో సరదాగా గడపడానికి జుహు బీచ్ కు వెళ్లారు. వారంతా కలిసి సముద్రంలో ఈతకు దిగగా భారీ అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. అయితే ఇంతులో ముగ్గురు సురక్షితంగా బైటపడగా నలుగురు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

గల్లంతయిన వారి కోసం నావికాదళానికి చెందిన సిబ్బందితో పాటు డైవింగ్ బృందాలు రంగాలోకి దిగాయి. అయితే ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభించగా మరో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

మృతి చెందిన యువకుల వివరాలు :  ఫర్దీన్‌ సౌదాగర్‌, సొహైల్‌ ఖాన్‌, ఫైసల్‌ షేక్‌, నజీర్‌ గాజి లుగా పోలీసులు గుర్తించారు. 

వాతావరణ పరిస్థితులు బాగోలేక సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఈ ప్రమాదం సంబవించిందని అధికారులు తెలిపారు. బీచ్ లో ఉన్న వారు వారించినా వినకుండా యువకులు సముద్రంలో దిగారని, దీంతె భారీ ఎత్తున ఎగిసిపడుతున్న అలలను తట్టుకోలేక సముద్రంలో మునిగిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


 

loader