నిర్భయ దోషులకు ఉరి... డెడ్ బాడీలను ఏం చేస్తారంటే...
శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉరి తర్వాత నలుగురు చనిపోయినట్లు డాక్టర్లు కూడా నిర్ధారించారు.. తర్వాత నలుగురి మృతదేహాలను జైలు నిబంధనల ప్రకారం ఆస్పత్రికి తరలిస్తారు.
దేశవ్యాప్తంగా ప్రజలు నిర్భయకు న్యాయం జరగాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురుచూపులకు నేడు ఫలితం దక్కింది. నిర్భయ కు అన్యాయం జరిగి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయ్యింది. చివరకు ఇప్పుడు దోషులకు ఉరిశిక్ష పడింది. ఇప్పటికే మూడుసార్లు ఉరి వాయిదా కాగా... ఎట్టకేలకు నలుగురు దోషులు ఉరికి వేలాడారు.
Also Read చివరి కోరిక తీర్చండి.. ఉరికి ముందు నిర్భయ దోషి వినయ్ తల్లి...
శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉరి తర్వాత నలుగురు చనిపోయినట్లు డాక్టర్లు కూడా నిర్ధారించారు.. తర్వాత నలుగురి మృతదేహాలను జైలు నిబంధనల ప్రకారం ఆస్పత్రికి తరలిస్తారు.
అయితే... ఉరి తర్వాత వారి డెడ్ బాడీలను ఏం చేయనున్నారు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా జైలు నియమాల ప్రకారం ఉరి శిక్ష అమలు తర్వాత నలుగురి మృతదేహాలను దీన్ దయాళల్ ఆస్పత్రిలో సరిగ్గా ఉదయం 8 గంటల సమయంలో పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిపించి.. డెడ్‌బాడీలను గుర్తిస్తారు.. తర్వాత వారికి అప్పగిస్తారు.
ఒకవేళ కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరిస్తే.. జైలు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలాగే జైల్లో ఉన్నంతకాలం నలుగురు దోషులు పనులు చేసి సంపాదించిన డబ్బును వారి కుటుంబాలకు అందజేయనున్నారు. కాగా.. దోషులు నలుగురు ఉరికి ముందు విశ్రాంతి లేకుండా గడిపారని జైలు అధికారులు చెప్పారు. కనీసం నిద్రకూడా పోకుండా ఉన్నారని.. వారి ముఖంలో భయం స్పష్టంగా కనపడిందని చెబుతున్నారు.