Asianet News TeluguAsianet News Telugu

39 మంది మ‌హిళా ఆర్మీ ఆఫీస‌ర్ల‌కు శాశ్వత క‌మిష‌న్.. సుప్రీం కోర్టులో ఫలించిన పోరాటం..

న్యాయ పోరాటం ఫలించింది.. ఇండియ‌న్ ఆర్మీలో 39 మంది మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు శాశ్వత క‌మిష‌న్ ల‌భించింది. ఇందుకు  సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం  తీర్పు  ఇచ్చింది. వారి కొత్త సర్వీస్ స్టేటస్ ఏడు పనిదినాల్లో మంజూరు చేయబడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

39 women officers get permanent commission in indian army after supreme court win
Author
New Delhi, First Published Oct 22, 2021, 1:44 PM IST

న్యాయ పోరాటం ఫలించింది.. ఇండియ‌న్ ఆర్మీలో 39 మంది మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు శాశ్వత క‌మిష‌న్ (Permanent Commission) ల‌భించింది. ఇందుకు  సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం  తీర్పు  ఇచ్చింది. వారి కొత్త సర్వీస్ స్టేటస్ ఏడు పనిదినాల్లో మంజూరు చేయబడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.శాశ్వత కమిషన్ నిరాకరించబడిన మొత్తం 71 మంది మహిళా షార్ట్ సర్వీస్  కమిషన్ ఆఫీసర్లు సుప్రీం  కోర్టును  ఆశ్రయించారు.  శాశ్వత కమిషన్ కోరారు. అయితే  ఈ 71 మంది  మహిళా అధికారులలో.. 39 మంది మాత్రమే శాశ్వత కమిషన్‌కు అర్హులు అని కేంద్ర ప్రభుత్వం Supreme Courtకు తెలిపింది. మిగిలిన  వారిలో 7గురు వైద్యపరంగా  అనర్హులని, 25 మందికి  క్రమశిక్షణ  సమస్యలు  ఉన్నాయని చెప్పింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం 25 మంది శాశ్వత కమిషన్‌కు అర్హులు కాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

న్యాయ పోరాటం  చేస్తున్న ఈ 71 మందిలో ఎవ‌రినీ రిలీవ్ చేయ‌కూడ‌ద‌ని అక్టోబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ అంశంపై జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ బీవీ నాగ‌రత్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రుపుతోంది. సీనియర్ లాయర్లు వి మోహన, హుజెఫా అహ్మది మరియు మీనాక్షి అరోరా.. మహిళా ఆర్మీ అధికారుల తరఫున వాదనలు  వినిపించారు. ఈ మ‌హిళా అధికారుల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం కొద్ది నెలల  కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే 39 మంది మహిళా అధికారుల‌కు శాశ్వత క‌మిష‌న్ ఇచ్చే ప్ర‌క్రియ‌ను మూడు నెల‌ల్లో పూర్తిచేయాల‌ని కేంద్రాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

Also read: మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్న అమిత్ షా.. అదనపు బలగాల మోహరింపు..

శాశ్వత కమిషన్ అంటే పదవీ విరమణ వరకు సైన్యంలో కెరీర్‌ను  కొనసాగించవచ్చు. అయితే షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మహిళలు సైన్యంలో 10 నుంచి 14 ఏళ్లు మాత్రమే సేవలు అందించేందుకు అవకాశం  ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ 10 సంవత్సరాల కెరీర్. 10 సంవత్సరాల ముగింపులో శాశ్వత కమిషన్‌ను వదిలివేయడం, ఎంచుకోవడం అనే ఎంపిక ఉంటుంది. అయితే అధికారికి శాశ్వత కమిషన్ లభించకపోతే.. అధికారి నాలుగు సంవత్సరాల పొడిగింపును ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios