Asianet News TeluguAsianet News Telugu

బస్సు బోల్తా.. 38 మంది జ‌వాన్ల‌కు గాయాలు, 9 మంది ప‌రిస్థితి విష‌మం

Panchmahal: గుజరాత్‌లోని కొండ ప్రాంతంలో బస్సు బోల్తా పడిన ఘ‌ట‌న‌లో 38 మంది జవాన్లు గాయపడ్డారు. ఫుట్ హిల్స్ వద్ద జరిగిన మూడు రోజుల కాల్పుల శిక్షణా సమావేశానికి హాజరైన తర్వాత జవాన్లు దాహోద్‌కు తిరిగి వస్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.
 

38 SRP jawans injured as bus overturns in hilly area in Panchmahal Gujarat RMA
Author
First Published Oct 31, 2023, 1:57 AM IST | Last Updated Oct 31, 2023, 1:57 AM IST

38 jawans injured as bus overturns: గుజరాత్‌లోని కొండ ప్రాంతంలో బస్సు బోల్తా పడిన ఘ‌ట‌న‌లో 38 మంది జవాన్లు గాయపడ్డారు. ఫుట్ హిల్స్  వద్ద జరిగిన మూడు రోజుల కాల్పుల శిక్షణా సమావేశానికి హాజరైన తర్వాత జవాన్లు దాహోద్‌కు తిరిగి వస్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.

వివ‌రాల్లోకెళ్తే.. సోమవారం సాయంత్రం గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని హలోల్ వద్ద కొండ ప్రాంతంలో బస్సు బోల్తా పడడంతో స్టేట్ రిజర్వ్ పోలీస్ (SRP)కి చెందిన 38 మంది సిబ్బంది గాయపడ్డారు, వారిలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ప్రాథమికంగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. బ్రేక్ వైఫల్యం కారణంగా డ్రైవర్ వాహ‌నంపై నియంత్రణ కోల్పోయాడు, ఫలితంగా బస్సు కిందకి వెళ్లి బోల్తాపడింది. ఫుట్ హిల్స్  వద్ద జరిగిన మూడు రోజుల కాల్పుల శిక్షణా సమావేశానికి హాజరైన తర్వాత జవాన్లు దాహోద్‌కు తిరిగి వస్తున్నారని పోలీసు అధికారి తెలిపారు.

"ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. వారిలో 38 మందికి గాయాలయ్యాయి. వీరంద‌రిని హలోల్‌లోని రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో 29 మంది ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే, మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలు అయ్యాయి. తదుపరి చికిత్స కోసం వడోదరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని" పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఎ జడేజా తెలిపారు. చికిత్స పొందుతున్న జ‌వాన్ల‌లో 9 మంది ప‌రిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios