దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అంతకంతకూ ఉద్ధృతిని, లాక్‌డౌన్ (lock down) సమయాన్ని గుర్తుచేస్తున్నాయి. తాజాగా 350 మంది పార్లమెంట్ సిబ్బందికి (parliament staff) కరోనా సోకడం కలకలం రేపుతోంది. రెండ్రోజులుగా పార్లమెంట్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 350 మందికి పాజిటివ్‌గా తేలింది
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అంతకంతకూ ఉద్ధృతిని, లాక్‌డౌన్ (lock down) సమయాన్ని గుర్తుచేస్తున్నాయి. తాజాగా 350 మంది పార్లమెంట్ సిబ్బందికి (parliament staff) కరోనా సోకడం కలకలం రేపుతోంది. రెండ్రోజులుగా పార్లమెంట్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 350 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో వారి కాంటాక్ట్‌లకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
మరోవైపు దేశంలో ఒక్క రోజులోనే ఏకంగా దాదాపు లక్షన్నర మంది కరోనా బారినపడ్డారు. Covid-19 మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ భయం ప్రజలు మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నతి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయి. ఇది ఏడు నెలల గరిష్టం. కేవలం ఎనిమిది రోజుల్లోనే Covid-19 మహమ్మారి ఏడు నెలల రికార్డును బ్రేక్ చేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారి Coronavirus కేసులు మళ్లీ లక్ష మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు చేరువైంది.
అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా బారినపడ్డవారి సంఖ్య 3,53,68,372కు చేరింది. యాక్టివ్ కేసులు సైతం గణనీయంగా పెరిగాయి. ఏకంగా నాలుగు లక్షలకు పైగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 4,72,169 క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఇదే సమయంలో కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి Covid-19 నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 3,44,12,740 కి చేరింది. కొత్తగా నమోదైన Coronavirus కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 40,925 కరోనా కేసులు అక్కడ నమోదయ్యాయి. అలాగే, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 68,34,222 కరోనా కేసులు, 1,41,614 మరణాలు నమోదయ్యాయి.
